Vitamin C: విటమిన్ సీ వల్ల కలిగే లాభాలు తెలుసా? ఇది లేకుంటే నష్టాలు కూడా తెలుసుకోండి..

Vitamin C Benefits: మనం తీసుకునే ఆహారంలో విటమిన్స్ మినరల్స్ ఉండాలి. అయితే విటమిన్ సి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపరుస్తుంది తద్వారా సీజనల్ వ్యాధులు మన దరిచేరకుండా ఉంటాయి. అయితే ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచేందుకు విటమిన్ సి ఎందులో ఉంటాయో తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Mar 16, 2025, 12:09 PM IST
Vitamin C: విటమిన్ సీ వల్ల కలిగే లాభాలు తెలుసా? ఇది లేకుంటే నష్టాలు కూడా తెలుసుకోండి..

Vitamin C Benefits: విటమిన్ సి తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన శక్తితో పాటు ఇమ్యూనిటీ వ్యవస్థ బలపరుస్తుంది. బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడుతుంది. అంతేకాదు ఇవి ఇన్ఫెక్షన్ల బారి నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది. విటమిన్ సీ కొల్లాజెన్‌ ఉత్పత్తి కూడా తోడ్పడుతుంది. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మన సెల్ డామేజ్ కాకుండా కాపాడుతాయి. అందుకే చాలామంది విటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే సహజ సిద్ధంగా విటమిన్ సి ఏ పండ్లలో ఉంటుంది? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఏ వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

పైనాపిల్‌లో బ్రొమలైన్ ఉంటుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉండటం వల్ల మన ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. పైనాపిల్ ఆర్థరైటీస్‌ సమస్యను కూడా తగ్గిస్తాయి.

బొప్పాయిలో కూడా విటమిన్ సి ఉంటుంది. ఆరెంజ్ వంటి వాటిల్లో కూడా విటమిన్ సి పుష్కలం ఇవి ఇమ్యూనిటీని పెంచి శరీరాన్ని కాపాడతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ రాకుండా నివారించే జీర్ణ ఆరోగ్యానికి సహాయపడతాయి. అంతేకాదు ఆరోగ్యకరమైన పేగు కదలికలకు ఇది ఎంతో మంచిది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.

జామ పండులో కూడా విటమిన్ సి ఉంటుంది. మన డైట్ లో చేర్చుకోవాలి. అయితే ఇందులో గ్లైసెమిక్ సూచీ (GI) కూడా తక్కువగా ఉంటుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. దీంతో పాటు ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బలపడుతుంది.

ఇదీ చదవండి:  అమ్మో.. చేప కొరికితే  చెయ్యి తీసేయాల్సి వచ్చింది.. అరుదైన ఇన్ఫెక్షన్ తస్మాత్‌ జాగ్రత్త..

ఉసిరిలో కూడా పోషకాలు పుష్కలం. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఆయుర్వేద పరంగా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ఉసిరి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇందులో యాంటీ ఏజింగ్ లాభాలు కూడా ఉంటాయి.

కీవీ పండులో విటమిన్ సి ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది డ్యామేజ్ అయిన డిఎన్ఏ అని కూడా రిపెయిర్‌ చేస్తుంది. అంతేకాదు కీవీ పండు చర్మా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది ఐరన్ గ్రహించడాన్ని పెంచుతుంది. మన డైలీ డైట్ లో కచ్చితంగా ఉండాలి. ఇది కాకుండా మునగాకు కూడా ఉంటుంది. ఇది సూపర్ ఫుడ్ విటమిన్ సి ఎక్కువ కలిగి ఉంటుంది. ఇందులో ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్నాయి. మునగాకు తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది. ఇవి కాకుండా బెల్ పెప్పర్స్ అంటే పసుపు ఎరుపు రంగులో ఉన్న క్యాప్సికం లో కూడా విటమిన్ సి ఉంటుంది డేటా కేరోటిన్ కంటి ఆరోగ్యానికి కాపాడుతుంది.

ఇదీ చదవండి:  ఈ 2 వస్తువులు ఉంటే.. పాములు గంటకు 12 మైళ్ల స్పీడ్‌తో మీ ఇంటికి పరుగెత్తుకుని వస్తాయి..!

 

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్- https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్- https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News