Vitamin D Side effects: మన శరీరానికి విటమిన్స్, ఖనిజాలు ఎంతో అవసరం. ప్రధానంగా ఇందులో విటమిన్ D గురించి చెప్పుకోవాలి. ఇది మన శరీరంలో లోపిస్తా అనే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రధానంగా ఎముకలు కండరాల, పనితీరు బలహీన పడిపోతుంది. ఇమ్యూనిటీ వ్యవస్థ దెబ్బతింటుంది. తద్వారా తరచూ ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. విటమిన్ D సాధారణంగా సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. ఇది కాకుండా కొన్ని రకాల సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు.
మన శరీరంలో విటమిన్ D లోపిస్తే ప్రధానంగా ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ విటమిన్ లేకపోవటం వల్ల ఖనిజాలు సరిగ్గా గ్రహించలేక పోతుంది. తద్వారా ఎముకలు మరింత బలహీనంగా మారిపోతాయి. ప్రధానంగా పిల్లలు రిక్కెట్ వ్యాధికి కూడా గురవుతారు. పెద్దవారిలో ఆస్టీయోపోరోసిస్ వ్యాధికి గురవుతారు.విటమిన్ D లోపించడం వల్ల తరచూ కండరాల నొప్పులకు గురవుతూ ఉంటారు. ఇది మన శరీరంలో సరైన మోతాదులో ఉండాల్సిందే. లేకపోతే తరచూ కాళ్లు, చేతులు నొప్పులు వస్తాయి. ఇది పెద్దవాళ్లలో చూసే లక్షణం.
ప్రతిరోజు ఆహారం తీసుకున్న గాని నీరసంగా ఉంటారు. తరచూ పడుకోవాలని అనుభూతి కలిగిస్తుంది. ఇది కూడా విటమిన్ డీ లోపమే. విపరీతంగా అలసట, తల తిరుగుడు కూడా జరుగుతుంది, శక్తి తగ్గిపోయే పరిస్థితులు ఉన్నాయి. విటమిన్ D లోపించడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలహీనపడుతుంది. తద్వారా సీజనల్ జబ్బులు వేధిస్తూ ఉంటాయి. తరచూ జలుబు, దగ్గు, ఫ్లూ బారిన పడతారు. ఈ విటమిన్ D లోపించడం వల్ల తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.
విటమిన్ D లోపించడం వల్ల ఎదురయ్యే మరో ఆరోగ్య సమస్య మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ గురవుతారు. యాంగ్జైటీ బారిన పడే అవకాశం కూడా ఉంది. విటమిన్ D లేమి వల్ల కొంతమందికి నిద్రలేమి సమస్య ఎదురవుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
Also Read : Donald Trump: ఇజ్రాయెల్ దాడి సరైందే.. ఇరాన్‌కు ఆ గతి పట్టాల్సిందే : డొనాల్డ్ ట్రంప్..
Also Read : భగ్గుమంటున్న పశ్చిమాసియా.. మిస్సైల్ దాడితో తగలబడి పోతున్న ఎయిర్ పోర్టు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook