)
Walking Vs Running For Safe Knees: ఇటీవల కాలంలో మోకాళ్ల నొప్పులతో చాలామంది బాధపడుతున్నారు. అయితే వాకింగ్ లేదా రన్నింగ్ చేస్తూ ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే మోకాళ్ళ ఆరోగ్యానికి వాకింగ్ లేదా రన్నింగ్ చేయాలా మోకాళ్ళకు వాపులు వచ్చే అవకాశం కూడా ఉంది. నొప్పులు కూడా సంభవిస్తాయి. కాబట్టి రెండిట్లో ఏది బెటర్ తెలుసుకుందాం.
ఇటువంటి కాలంలో రెట్రో వాకింగ్ అంటే వెనుక వైపుగా అడుగులు వేస్తూ వాకింగ్ చేయడం వంటివి పెరిగిపోయింది. ఇది కండరాల ఆరోగ్యానికి మంచిది. రివర్స్ వాకింగ్ కూడా మోకాళ్ల ఆరోగ్యానికి మంచిదే. ఇది మోకాళ్ళపై ప్రెజర్ కూడా తగ్గిస్తుంది. దీంతో మోకాళ్ల నొప్పులు వంటివి సంభవించవు.. నడిచినప్పుడు బ్యాలెన్స్ కూడా అవుతుంది. కాబట్టి అదుపు తప్పకుండా ఉంటారు. మోకాళ్ల చుట్టూ నొప్పులు కూడా రాకుండా ఉంటాయి.
వెనుక వైపుగా వాకింగ్ చేయడం వల్ల ఫిజికల్ గా కూడా యాక్టివ్ గా ఉంటారు. త్వరగా నయం కావాలంటే సర్జరీ అయిన వాళ్ళు కూడా ఈ వెనుక వైపు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది జాయింట్ పైన స్ట్రెస్ కూడా తగ్గిస్తుంది. రన్నింగ్ తో పోల్చుకుంటే రివర్స్ వాకింగ్ వల్ల మీరు గాయాల పాలు కూడా అవ్వకుండా ఉంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వాకింగ్ అనేది జాయింట్ పెయిన్ సమస్యను తగ్గిస్తుంది. వెనుక వైపుగా నడవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
స్ట్రెస్ కూడా తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ ఆర్థోఆర్థరైటిస్ తో బాధపడుతున్న వాళ్ళు వాకింగ్ చేయడం బెట్టర్. రన్నింగ్ యాక్టివ్ గా ఉన్నవాళ్లు నిత్యం జిమ్ కి వెళ్లే వాళ్ళు చేసుకుంటారు. అయితే మోకాళ్ల సమస్యలు రాకుండా ఉండాలంటే జాయింట్ పైన స్ట్రెస్ పడకుండా ఉండాలంటే వాకింగ్ చేయడం బెట్టర్. గాయాల పాలు కాకుండా ఉంటారు. తీవ్ర మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్న వారు మెల్లిమెల్లిగా వాకింగ్ వంటివి సరైన జాగ్రత్తలు తీసుకొని చేస్తూ ఉండాలి.
వెనుక వైపు వాకింగ్ చేయడం వల్ల కండరాల ఆరోగ్యం బాగుంటుంది. స్ట్రెస్ పడకుండా ఉంటుంది. మంచి రక్త సరఫరా కూడా మెరుగు చేస్తుంది. వెనుకవైపు ప్రతిరోజు ఒక 30 నిమిషాలు అయినా ట్రెడ్ మిల్ పైన కూడా నడవవచ్చు. మీ డైలీ వాకింగ్ చేసే బదులు రివర్స్ వాకింగ్ చేయడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. మోకాళ్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. తక్షణ ఎనర్జీ కూడా అందిస్తుంది. రక్తనాళాల్లో ఆక్సిజన్ సరఫరా కూడా మెరుగవుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి