140 KGs To 78 KGs Weight Loss: అధిక బరువు అనేది సర్వ రోగాలకు కారణంగా నిలుస్తుంది. బరువు అధికంగా ఉన్నవారికి చాలా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. తినే ఆహారంతోపాటు శారీరక శ్రమ చేస్తేనే బరువు తగ్గుదల అనేది సాధ్యమవుతుంది. ప్రముఖ ఫిట్‌నెస్ నిపుణుడు పువి కూడా అధిక బరువుతో బాధపడేవాడు. 140 కిలోలతో భారీ కాయంతో పువి ఉన్నాడు. బరువు అధికంగా పెరగడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వ్యాయామంతోపాటు ఆహార నియమాలు మార్చుకున్నాడు. దీంతో 62 కిలోలు తగ్గించుకున్నాడు. ఇప్పుడు మాంచి బాడీ షేపుతో అందరినీ ఆకర్షించేలా తయారయ్యాడు. చీదరించుకుని.. అవమానించిన వాళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. పువి బరువు తగ్గుదల రహాస్యం తెలుసుకుందాం.
Also Read: Telangana Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 2 జాబ్ నోటిఫికేషన్లు విడుదల
పెద్ద పొట్టతో, భారీ బరువుతో పువి ఉండేవాడు. కఠినమైన ఆహార నియమావళి, క్రమం తప్పని వ్యాయామంతో ఫిట్‌గా మారాడు. 140 కిలోల నుంచి 78 కిలోల బరువుకు చేరడానికి తాను పడిన కష్టాన్ని పువి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 2023 నవంబర్‌లో తన వెయిట్‌లాస్ జర్నీని పువిని పంచుకున్న ఈ వీడియో ఎప్పటికైనా ఇది అందరికీ దోహదం చేసేది. బరువు తగ్గాలనుకునే వారు తప్పక ఇది చూడాల్సిన వీడియో. హై-కార్బ్ డైట్‌ను తాను పూర్తిగా పక్కన బెట్టినట్లు పువి తెలిపాడు. ప్రొటీన్ ఆహారం, అధికంగా నీరు తాగడంతో 62 కిలోలు తగ్గినట్లు వెల్లడించారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ
కార్బొనేటెడ్ డ్రింక్‌లకు స్వస్తి
బరువు తగ్గడానికి పువి తాను సాధారణంగా తీసుకునే ఆహారాన్ని పూర్తిగా పక్కనపెట్టాడు. తన ఆహార నియమావళిని మార్చుకున్నాడు. ప్రాసెస్ చేసిన కార్బొహైడ్రేట్లు, చక్కెరలను పూర్తిగా తగ్గించాడు. కూల్ డ్రింక్‌లు, చక్కెర కార్బొనేటేడ్ డ్రింక్‌లను కూడా తీసుకోవడం బంద్ చేశాడు. వాటిల్లో చెత్త తప్ప ఏమీలేదని పువి కీలక విషయాన్ని తెలిపాడు. వీలైనంత ఎక్కువగా తాగునీరు తీసుకోవడంతోపాటు చాలా తక్కువ సార్లు మాత్రమే ఛాయ్ తాగాడు. ఆహారంలో అత్యధికంగా కూరగాయలు ఉండేలా చూసుకున్నాడు. మసాలా దినుసులతో ఉడికించిన చికెన్ తినడంతో శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా పువి జాగ్రత్త పడ్డాడు.
Also Read: Bank Holidays: రేపటి నుంచి 3 రోజులు బ్యాంకులకు సెలవు.. ఎందుకో తెలుసా?
తాగునీళ్లు
అధికంగా బరువు ఉండడంతో దానిని తగ్గించుకునేందుకు వ్యాయామంపై పువీ దృష్టి సారించాడు. ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడంతోపాటు వారానికి నాలుగు సార్లు రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేశాడు. భారీ వ్యాయమాలు కాకుండా ఫన్ కార్డియో పద్ధతిలో వ్యాయామాలు పువి చేశాడు. హెవీ బ్యాగ్ కొట్టడం, స్కిప్పింగ్, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ ఇలా ప్రత్యేక పద్ధతుల్లో తన బరువు తగ్గుదల యజ్ఞాన్ని చేపట్టాడు. మీరు కూడా పువి అంత స్థాయిలో కాకుండా సాధ్యమైనంత నిత్యం వ్యాయామం చేయడంతోపాటు పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. ఇక వీలైనంత ఎక్కువగా తాగునీళ్లు తీసుకోవడం మంచిది. బరువు తగ్గుదల వీటి ద్వారా సాధ్యమని పువి చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









