Nutrient Deficiency: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? అయితే జాగ్రత్త సుమీ...

  Nutrient Deficiency Symptoms: శరీరానికి అవసరమైన పోషకాలు తగినంతగా అందకపోతే పోషకాహార లోపం ఏర్పడుతుంది. ఇది పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరిలోనూ కనిపిస్తుంది. పోషకాహార లోపం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.  

Written by - Shashi Maheshwarapu | Last Updated : Mar 9, 2025, 09:10 PM IST
Nutrient Deficiency: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా? అయితే జాగ్రత్త సుమీ...

 

Add Zee News as a Preferred Source

Nutrient Deficiency Symptoms: మనలో చాలా మంది చిన్న చిన్న సమస్యలను తేలికగా తీసుకుంటారు.. ఉదాహరణకు జుట్టు రాలటం, గోళ్లు పొడిబారటం లేదా తరచుగా మూడ్ చేంజ్ అవటం వంటివి.. నిజానికి ఇవేం పెద్ద సమస్యలు కావు..  అలాగని చిన్న సమస్యలు కూడా కాదు.. నిజానికి ఇవి కలగటానికి ప్రత్యేక కారణాలు ఉంటాయి.. మన శరీరంలో ఏదైనా పోషకం తగ్గినా లేదా పెరిగిన ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి, మనం తీసుకునే ఆహారంలో ప్రతి పోషకం చాలా ముఖ్యం మరియు ఏది తగ్గిన అది మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఒకవేళ మీరు కానీ ఇక్కడ పేర్కొన్న సమస్యలు ఎదుర్కొంటే మాత్రం మీరు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని అర్థం.. 

పోషకాహార లోపం వలన శక్తి లేమి, మానసిక ఆందోళన, చర్మ సమస్యలు, జుట్టు రాలడం, మెదడు పనితీరు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే, అవి పోషకాహార లోపాన్ని సూచించే సంకేతాలు కావచ్చు.

అలసట

శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోతే, సులభంగా అలసిపోతాం. ఐరన్ , విటమిన్ B12, ప్రోటీన్లు తక్కువగా ఉండడం వల్ల శక్తి లేకుండా ఉంటుంది. ఒకవేళ మీరు కూడా ఈ లక్షణాన్ని గమనిస్తే వెంటనే మీరు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, మెంతులు, బ్రోకోలీ, గుడ్లు, పాలు, బాదం, సపోటా వంటివి ఉండేలా చూసుకోండి. 

చర్మం పొడిబారడం

కొన్ని సార్లు కొన్ని పోషకాల కొరత ఏర్పడితే మన చర్మం పొడిబాటుంది. విటమిన్ A, విటమిన్ C, ఒమెగా-3 యాసిడ్స్ లేకపోతే చర్మం మురికిగా, పొడిగా మారుతుంది. వీటి లోపం వలన చర్మం పై ముడతలు త్వరగా రావచ్చు. ఫలితంగా మీరు వృద్దులుగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో మీరు ఎక్కువగా క్యారెట్, బీట్‌రూట్, పుచ్చకాయ, చేపలు, అవకాడో, నాట్స్, ఆకుకూరలను మీ డైట్ లో చేర్చుకోవాలి. 

జుట్టు రాలడం, చుండ్రు 

ప్రోటీన్, బయోటిన్, ఐరన్, జింక్ వంటివి మీ శరీరంలో తక్కువగా ఉంటే జుట్టు రాలడం మొదలవుతుంది. ముఖ్యంగా ఒమెగా-3 కొవ్వులు కొరత ఏర్పడితే మీరు ఎక్కువగా చుండ్రు సమస్యలతో బాధపడతారు. ఈ సమస్య నుండి గట్టెక్కాలి అంటే.. గుడ్లు, పెరుగు, పాలకూర, వేరుశెనగ, అల్లం, నువ్వులు, చేపలు, ఆలివ్ ఆయిల్ వంటివి ఎక్కువగా తింటానికి ప్రయత్నించండి. 

గాయాలు త్వరగా మానకపోవడం 

సాధారణంగా తీవ్రమైన గాయాలు మానటానికి ఎక్కువ సమయం పడుతుంది. ఒకవేళ చిన్న చిన్న గాయాలు కూడా మానటానికి ఎక్కువ పడుతుంది అంటే మీరు విటమిన్ C, ప్రోటీన్, జింక్ లోపంతో బాధపడుతున్నారని అర్థం.. ఫలితంగా శరీరంలో కాలాజన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.ఇలాంటి సమయంలో నిమ్మ, మామిడి, బొప్పాయి, నారింజ, టమాటా, గుడ్లు, సోయా ప్రొటీన్లును ఎక్కువగా తీసుకోవాలి. 

బలహీనమైన గోళ్ల  

శరీరంలో కాల్షియం, విటమిన్ B7 , ఐరన్ తక్కువగా ఉంటే గోర్లు బలహీనంగా మారతాయి. కొన్నిసార్లు గోళ్లపై తెల్లటి మచ్చలు కూడా రావచ్చు. బాదం, వేరుశెనగ, పాలకూర, సీతాఫలము, గుడ్లు, గోధుమ, పాల ఉత్పత్తులు మీకు ఈ సమయంలో మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. 

మూడ్ స్వింగ్స్ & మానసిక ఒత్తిడి 

ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య మూడ్ స్వింగ్స్, మానసిక ఒత్తిడి. ఒమెగా-3 ఫాటీ యాసిడ్స్, విటమిన్ B12, మెగ్నీషియం తక్కువగా ఉంటే మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి. ఈ లోపం వల్ల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య త్వరగా తగ్గించుకోవాలి అంటే వాల్ నట్స్, చేపలు, అవకాడో, గోధుమ రొట్టి, క్యాబేజీ, సీడ్‌లు, మామిడి వంటి ఆహారాలని డైట్ లో చేర్చుకోవాలి.

 

 

 

 

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News