)
What Is DVT: ఏవైనా పండుగలు.. లేదా జర్నీ చేయాల్సిన సందర్భాల్లో పీరియడ్స్ పోస్ట్ పోన్ కావడానికి మహిళలు హార్మోనల్ పిల్స్ తీసుకుంటారు. అయితే ఇలా పిల్స్ వేసుకున్న యువతి మరణించింది అని బెంగళూరు వాస్కూలర్ సర్జన్ తెలిపారు. ఆమె డీప్ వెయిన్ థ్రాంబోసిస్ తో మరణించిందని వైద్యుడు ధ్రువీకరించారు. తీవ్రమైన కాలినొప్పితో అమ్మాయి తన దగ్గరకు వచ్చిందని, తొడ నుంచి వాపులు వచ్చాయి. అది డీవీటీ అని అర్థమైంది. కానీ వెంటనే అడ్మిట్ చేయాలని చెప్పినా ఆమె తండ్రి వినకపోవడంతో ఆరోజు రాత్రి అమ్మాయి చనిపోయిందని వైద్యులు చెప్పారు. తమను సంప్రదించాకే పిల్స్ వాడాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు.
18 ఏళ్ల ఈ అమ్మాయి గురించి వాస్కులర్ సర్జన్ డాక్టర్ వివేకానంద ఒక పాడ్ క్యాస్ట్ లో మాట్లాడారు. ఆగస్టు 14వ తేదీన ఎపిసోడ్లో ఇది ఆయన వివరించారు. థ్రాంబోసిస్ నిశ్శబ్ద ముప్పు అని ఆయన అన్నారు. చాలామంది ఏదైనా టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు ఇంట్లో పూజలు వంటివి ఉన్నప్పుడు మహిళలు ఇలాంటి పిల్స్ వేసుకుంటారు. పీరియడ్స్ పోస్ట్ పోన్ చేయడానికి ఇవి తరచూ ఉపయోగిస్తున్నారు. అయితే ఆ అమ్మాయి కూడా అదే విధంగా వేసుకోవడం వల్ల కాళ్ళ నుంచి తొడలు వరకు పూర్తిగా నొప్పి, వాపులు అనిపించడంతో ఆమె ఆసుపత్రికి వచ్చింది. అదే సమయంలో ఆమె పీరియడ్ పోస్ట్ పోన్ కి హార్మోనల్ మాత్రలు తీసుకున్నట్లు చెప్పింది. అయితే స్కాన్ చేసినప్పుడు DVT ఉందని తెలిసింది. ఆమె నాభి వద్ద రక్తం గడ్డ కట్టిందని వైద్యుడు చెప్పాడు. అయితే ఆమె తండ్రితో మాట్లాడి అమ్మాయిని ఆసుపత్రిలో చేర్పించమని కోరగా వాళ్ళు తిరస్కరించే అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి 2 గంటలకు ఆ అమ్మాయి ఎమర్జెన్సీలో ఊపిరాడని పరిస్థితిలో ఉందని తెలిసింది. అప్పటికే ఆసుపత్రికి తీసుకురాగా ఆమె చనిపోయింది.
DVT అంటే ఏంటి?
డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. ఇది నిశ్శబ్దంగా వ్యాపించే ప్రాణాంతక రక్తం గడ్డ కట్టే పరిస్థితి అని చెప్పొచ్చు. సాధారణంగా ఇది కాళ్లలో కనిపిస్తుంది. దీని లక్షణాలు కాళ్లలో వాపులు, నొప్పులు, అసౌకర్యంగా రక్తం గడ్డకట్టుకుపోవడం. ఇది కాలేయంలో కూడా కనిపిస్తుంది. ఇది ప్రాణాంతక వ్యాధి. హార్మోనల్ పిల్స్, జన్యుపరంగా లేకపోతే ఎక్కువ కాలం పీరియడ్స్ అవ్వని వారిలో కనిపిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook