Makhana Precautions: ఆరోగ్యపరమైన ప్రయోజనాల దృష్ట్యా ఈ మధ్యకాలంలో మఖనాకు డిమాండ్ పెరుగుతోంది. అయితే మఖనా తినేటప్పుడు మీరు చేసే కొన్ని పొరపాట్లు కారణంగా ప్రయోజనాలు కాదు కదా..హాని కలగవచ్చు. అందుకే మఖనా ఎలా తినాలి, ఎంత తినాలనేది తప్పకుండా తెలుసుకోవాలి. ముఖ్యంగా కొన్ని పొరపాట్లు చేయకూడదు.
ఆరోగ్య ప్రయోజనాలు, పోషక విలువల కారణంగా మఖనాకు వినియోగం పెరుగుతోంది. రుచి కూడా బాగుండటంతో అందరూ ఇష్టపడుతుంటారు. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే మఖనా తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మఖనా అతిగా తినకూడదంటున్నారు. అదే సమయంలో మఖనా ఎలా తినాలి, ఎప్పుడు తినాలనేది కూడా చాల ముఖ్యమంటున్నారు. మఖనాలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల అతిగా తింటే లేదా నీళ్లు తగినంత తాగకపోతే జీర్ణక్రియ మందగించే ప్రమాదం ఉంది. మలబద్ధకం సమస్య ఉత్పన్నం కావచ్చు. కొంతమందికి మఖనా తిన్న తరువాత కడుపులో గ్యాస్, స్వెల్లింగ్, ఉబ్బరం వంటి సమస్యలు ఉంటాయి. మఖనా వాస్తవానికి మధుమేహం వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది కానీ అధిక మొత్తంలో తీసుకుంటే బ్లడ్ షుగర్ పూర్తిగా పడిపోయి తల తిరగడం, బలహీనత రావచ్చు. మఖనా కొంతమందికి ఎలర్జీ కల్గిస్తుంది. అలాంటి వ్యక్తులు దూరంగా ఉండాలి. బీపీ సమస్య ఉన్నవాళ్లు అతిగా మఖనా తినడం మంచిది కాదు. తల తిరగడం, సొమ్మసిల్లడం వంటి ప్రమాదకర సమస్యలు రావచ్చు. ఇందులో ఉండే ఆక్సలేట్స కారణంగా ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్య ఉత్పన్నం కావచ్చు.
మఖనా ప్రయోజనాలు
అయితే మఖనాతో ప్రయోజనాలు చాలా ఎక్కువ. రోజూ క్రమం తప్పకుండా సేవిస్తే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. గుండెను పదిలంగా ఉంచుతుంది. గుండె వ్యాధుల ముప్పు తగ్గుతుంది. కడుపు దీర్ఘకాలం నిండినట్టుగా ఉండటం వల్ల బరువు నియంత్రణలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వివిధ రకాల వ్యాధుల్నించి కాపాడుతాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇందులో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ రోగులకు చాలా మంచిది.
మఖనా ఎలా తినాలి
మఖానా ఎలా తినాలనేది చాలా ముఖ్యం. మఖనా అతిగా ఎప్పుడూ తినకూడదు. మఖనా తిన్నప్పుడు నీళ్లు తప్పకుండా తాగాలి. ఒకవేళ 2 నెలలుగా మఖనా తింటుంటే మధ్యలో ఓ నెల విరామం ఇవ్వాలి. అంతేకాదు..అతిగా తినకూడదు. నెయ్యిలో రోస్ట్ చేసి తినడం అన్నింటికంటే ఉత్తమమైనది.
Also read: Thalliki Vandanam: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్, ఏప్రిల్ నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









