Foods For Warming The Body: శీతాకాలంలో సాయంత్రం నుంచి మొదలైన చలిగాలులు తర్వాతి రోజు సూర్యుడు వచ్చేంత వరకు వణుకు పుట్టిస్తాయి. ఈ చలిగాలలు నేపథ్యంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. అలాంటి సమయంలోనే ఉన్ని దుస్తులతో శరీరాన్ని సంరక్షించుకోవాలి. దాంతో పాటు ఏమైనా వేడివేడి ఆహారాన్ని భుజించాలనిపిస్తుంటుంది. అయితే అలాంటి ఆహారం శరీరానికి వెచ్చగా ఉంచడమే కాకుండా.. వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచడం సహా పోషకాల లోపాన్ని తీర్చే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఈ శీతాకాలంలో కొన్ని ఆహార పదార్థాలను రోజూవారీ మెనూతో కలిపి తీసుకోవడం వలన శరీరాన్ని వేడిగా కూడా ఉంచుకోవచ్చు అని న్యూట్రిషన్లు అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తృణధాన్యాలు, రంగురంగుల కూరగాయలతో చేసిన సూప్‌లు శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు సహాయపడతాయి. అదేవిధంగా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చలికాలంలో మన శరీరం ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తుంది. ఇతర సీజన్లలో కంటే శీతాకాలంలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువగా ఉండటానికి కారణం కూడా ఇదే. శీతాకాలంలో ఆహారాన్ని కొద్దిగా ఎక్కువగా తీసుకున్నా ఏం ఇబ్బంది ఉండదు. ఆహారంలో ముతక తృణ ధాన్యాలను చేర్చుకోవడం చాలా మంచిది. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి.


  • శీతాకాలం ప్రారంభం నుంచి ఆహారంలో మొక్కజొన్న, జొన్న, బజ్రా, రాగులను తీసుకోవాలి. వీటితో తయారుచేసిన వివిధ రకాల వంటకాలను తినాలి. వాటితో ఉపయోగించి గంజి, రోటీ, దోస వంటి పదార్థాలను చేసుకుని తింటుండాలి. ఇవి మన శరీరం బరువును నియంత్రించడం సహా శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి.

  • చలికాలంలో అనేక రకాల కూరగాయలు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి. ఈ సమయంలో వివిధ కూరగాయలతో సూప్ తయారు చేసుకుని తీసుకోవడం చాలా మంచిది. ఇది శరీరంలో నీరు, పోషకాల కొరతను భర్తీ చేస్తుంది. వీటిలో నల్ల మిరియాల పొడిని చేర్చడం వల్ల మరింత ఉపయోగం పొందవచ్చు. మిక్స్‌డ్ వెజిటబుల్ సూప్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి.

  • మెంతికూర, బచ్చలికూర, ఆవాలు వంటి పచ్చి కూరగాయలు తీసుకోవాలి. వీటిలో విటమిన్లు ఏ, ఈ, కే, ఫోలిక్ యాసిడ్, ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. లంచ్ లేదా డిన్నర్ కోసం ఏదో ఒక రూపంలో వీటిని తినడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు.

  • నువ్వులు, పల్లి, బెల్లం కలిపి లేదా విడివిడిగా తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. వీటి ప్రభావంతో వేడి లభించడమే కాకుండా చలికాలంలో శరీరానికి అవసరమైన ఇనుము కూడా లభిస్తుంది. చలికాలంలో వచ్చే ప్రధాన సమస్య చర్మం పొడిబారడం నుంచి బయటపడొచ్చు. టీ లేదా క్యారెట్ పాయసం వంటి వాటిలో చక్కెరకు బదులుగా బెల్లం వాడటం అలవాటు చేసుకోవడం శ్రేయస్కరం.

  • చలికాలంలో చెమట రాదని చాలా మంది నీరు తక్కువగా తాగుతుంటారు. శరీరం సక్రమంగా పనిచేయడానికి నీరు చాలా అవసరం అని గుర్తుంచుకోవాలి. అందుకే చలికాలం అయినప్పటికీ నిత్యం 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. నీరు తక్కువగా తాగడం మన జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది.    


Also Read: Heart Attack Symptoms: హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే..


Also Read: Health tips: గుడ్డుతో పాటు ఈ ఆహారపదార్థాలు కలిపి తింటే.. ఇక అంతేనట!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook