Clay Pot Benefits: మట్టి కుండ నీరు తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. ఫ్రిజ్ నీటితో ఆరోగ్య సమస్యలు తప్పవు. ప్రధానంగా ఇవి ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడతాయి. వీటి వల్ల అనారోగ్యం తప్పఇంకేమీ ఉండదు అయితే, ఎన్నో ఏళ్లుగా మన పూర్వీకులు వాడిన మట్టి కుండ నీరు తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ. ఫ్రిజ్‌లో నీరు తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వస్తుంది. ఆస్తమా ఉన్నవారి పరిస్థితి మరింత దారుణం. దీనివల్ల గొంతునొప్పి సమస్య కూడా ఎక్కువవుతుంది. అయితే, మట్టి కుండ నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
కుండల తయారీకి ఉపయోగించే మట్టి మలినాలను, హానికరమైన విషాన్ని గ్రహిస్తుంది. ఇందులో ఉన్న ఖనిజాలు మన శరీరానికి అందిస్తుంది. అంతేకాదు ఇంతులో ఐరన్, మెగ్నీషియం ఉంటుంది.సహజంగా మన శరీరానికి వీటిని అందిస్తుంది.
అయితే, సహజంగా మట్టి కుండునీటిని తీసుకోవడం వల్ల మన శరీరాన్ని చల్లబరుస్తుంది అంతేకాదు ఇందులోని ఖనిజాలు కూడా పూర్తి స్థాయిలో మనకు అందుతాయి. ఈ మట్టికుండ నీరు పీహెచ్ స్థాయిలను కూడా నిర్వహిస్తాయి. మట్టి కుండ నీటిని ఉపయోగించడం వల్ల నీటి రుచి కూడా పెరుగుతుంది. అంతేకాదు ఇది ఖనిజాలు, లవణాలను కూడా గ్రహిస్తుంది.
అంతేకాదు ఈ మట్టికుండనీరు పర్యావరణం అనుకూలం. ప్లాస్టిక్ బాటిల్‌కంటే కూడా ఇవి పర్యావరణానికి హాని కలిగించవు. అందుకే వేసవి దాహన్ని తీర్చుకోవడానికి కేవలం ఈ మట్టి కుండ నీటిని మాత్రమే తీసుకోండి.
ఈ మట్టికుండ నీటిని తీసుకోవడం వల్ల మన కడుపులో యాసిడిటీ సమతులంగా ఉంటుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. ఈ నీళ్లు మన శరీరానికి మంచి ఖనిజాలు అందించడం మాత్రమే కాదు మాయిశ్చర్‌ను నిలుపుతుంది. ఈ మట్టికుండ నీటిలో సహజంగా ఆల్కలై్ ఉంటుంది. ఇది పీహెచ్ స్థాయిలను నిర్వహిస్తుంది. జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇందులో ఎలాంటి కెమికల్స్ కూడా ఉండవు. మన శరీరాన్ని సహజంగా డిటాక్సిఫై చేస్తుంది.
ఇదీ చదవండి: పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఆసిఫ్ ఇంటిని పేల్చేసిన భద్రతా దళాలు.. వీడియో వైరల్..
ఇదీ చదవండి: రాత్రంతా ఏసీ వేసుకుని పడుకుంటున్నారా? మీ శరీరంలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









