Pregnant Women Diabetes Diet: నేడు అనగా నవంబరు 14న ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం. ఈ క్రమంలో ప్రస్తుతం చాలా మంది షుగర్ బారిన పడుతున్నారు. మరీ ముఖ్యంగా మహిళల్లో చాలా మంది గర్భం దాల్చిన తర్వాత బిడ్డకు డయాబెటిస్ సంక్రమించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో షుగర్ వ్యాధిగ్రస్తురాలు గర్భదారణ సమయంలో రక్తంలో చక్కెరను ఎలా అదుపులో ఉంచుకోవాలి? ఇలా షుగర్ కంట్రోలింగ్ అనేది తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
డయాబెటిస్ ఇన్ ప్రెగ్నెన్సీ స్టడీ గ్రూప్ ఇండియా (DIPSI), FOGSI మార్గదర్శకాల ప్రకారం.. గర్భదారణ తర్వాత ఆరోగ్యకరమైన ఆహారం, క్రమతప్పకుండా వ్యాయామం వంటివి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేందుకు తోడ్పతాయి. ఇవి మహిళల్లో ఇన్సులిన వంటి అవసరాన్ని నివారించడంలో సహాయపడతాయి. వీటితో పాటు గర్భిణీలు పాటించాల్సిన అనేక ఆరోగ్య సూత్రాలను ఫెర్నాండేజ్ హాస్పిటల్ ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ప్రియాంక మల్లిడి వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన ఆహారం..
ఆరోగ్యకరమైన భోజన ప్రణాళిక చక్కెరలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఒకపూట భోజనం మానేయడం లేదా అతిగా తినడం కంటే రోజు మొత్తం మూడు సార్లు భోజనం.. మరో మూడు సార్లు స్నాక్స్ తీసుకోవడం ఉత్తమం.
అదే విధంగా గర్భదారణ తర్వాత మహిళలు మీ రోజువారీ ఆహారంలో సుమారుగా 55–60% కార్బోహైడ్రేట్లు, 10–15% ప్రోటీన్, 20–25% ఫ్యాట్, కొవ్వులు 7% కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి.
• మంచి కార్బోహైడ్రేట్లు: బ్రౌన్ రైస్, మిల్లెట్లు, ఓట్స్, హోల్-గోధుమ చపాతీ, చిరుధాన్యాలు, బీన్స్, కూరగాయలు, తృణధాన్యాలు. తెల్ల బియ్యం, స్వీట్లు, పేస్ట్రీలు, కూల్‌డ్రింక్స్ వంటి పానీయాలకు దూరంగా ఉండండి.
• ప్రోటీన్లు: పప్పు, గుడ్లు, పనీర్, పెరుగు, టోఫు, చికెన్, చేపలు లేదా లీన్ మీట్స్. ప్రతి భోజనంలో ప్రోటీన్ ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ తప్పకుండా చేర్చండి. ఇది మిమ్మల్ని కడుపు నిండి ఉండేలా చేస్తుంది. చక్కెర పెరుగుదలను నెమ్మదిస్తుంది.
• ఆరోగ్యకరమైన కొవ్వులు: గింజలు, అవకాడో, ఆలివ్, ఆవాలు లేదా వేరుశనగ నూనె.
వెన్న, నెయ్యి, క్రీమ్, వేయించిన ఆహారాలు, ఎర్ర మాంసం వంటి వాటిని ఎక్కువగా తినొద్దు. ఉదయం చక్కెర స్థాయిలు తరచుగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పెసరట్టు లేదా పప్పు దోశతో గుడ్డు లేదా పనీర్ వంటి తేలికపాటి, అధిక ప్రోటీన్ కలిగిన అల్పాహారాన్ని తీసుకోవడం ఉత్తమం.
స్మార్ట్ ఈటింగ్ హ్యాబిట్స్
గర్భదారణ తర్వాత మహిళలు ఆదర్శంగా తిండిని తీసుకోవాలి. సలాడ్లు లేదా కూరగాయలతో ప్రారంభించి.. ఆ తర్వాత తరువాత ప్రోటీన్ ఆహారాలు, బియ్యం లేదా రోటీ వంటి కార్బోహైడ్రేట్లతో ముగించాలి. ఇది భోజనం తర్వాత చక్కెర పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతుంది. పుష్కలంగా నీరు త్రాగండి. ప్రతి భోజనానికి ముందు ఫైబర్ ఎక్కువ ఉన్న తిండి తినాలి.
చురుగ్గా ఉండండి
వ్యాయామం వల్ల మీ శరీరం ఇన్సులిన్‌ను నియంత్రిస్తుంది. వారంలో రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేసేందుకు లక్ష్యాన్ని పెట్టుకోండి. ఇందులో భాగంగా వాకింగ్, ప్రినేటల్ యోగా, స్విమ్మింగ్ వంటివి చేయోచ్చు. భోజనం తర్వాత 10–15 నిమిషాల వాకింగ్ కూడా చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









