Jubilee Hills: పీనుగలు పీక్క తినేటోడు వచ్చిండు.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Sensational Comments Revanth Reddy: జూబ్లీహిల్స్‌ ప్రచారంలో రేవంత్‌ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీనుగలు పీక్కు తినే రేవంత్‌ రెడ్డి వచ్చాడని మండిపడ్డారు. కాంగ్రెస్‌, ఎంఐఎం వాళ్లతో జాగ్రత్త అని హెచ్చరించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 6, 2025, 08:54 PM IST
Jubilee Hills: పీనుగలు పీక్క తినేటోడు వచ్చిండు.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: ఎన్నికల ప్రచారంలో భాగంగా మేం సభ పెట్టుకుంటే ఎవరికెందుకు నొప్పి? అనుమతి ఇచ్చి రద్దు చేస్తారా? మీ పర్మిషన్ సంకలో పెట్టుకోండి. పాతబస్తీలోనే సభ పెట్టి సత్తా చూపినం. ఈ బోరబండ మాది.  బరాబర్ సభ పెడతాం' అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్ ప్రకటించారు. కాషాయ జెండాను రెపరెపలాడిస్తామని చెప్పారు. కాంగ్రెసోళ్లు తురకోళ్ల లెక్క టోపీ పెట్టుకున్నారని.. నమాజ్ పేరుతో డ్రామాలాడుతున్నారని రేవంత్ రెడ్డిపై బండి సంజయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Add Zee News as a Preferred Source

Also Read: Jubilee Hills: ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి.. రెచ్చిపోతున్న రేవంత్‌ రెడ్డిపై చర్యలేవీ?

'నేను హిందువు. ఇతర మతాలను గౌరవిస్తా తప్ప కించపర్చను. టోపీ పెట్టుకునే పరిస్థితే వస్తే తల నరుక్కుంటా. కాంగ్రెసోళ్లు అనుమానమొస్తుంది. వీళ్ల డీఎన్ఏను చెక్ చేయాల్సిందే. బండి సంజయ్‌ను ఆపడం మీ తరం కాదు. ఇది మీ అయ్య జాగీరా? కేసీఆర్ గడీలు బద్దలు కొట్టి ఫాంహౌజ్ కొట్టింది మేం' అని బండి సంజయ్‌ తెలిపారు. ప్రజలు అల్లాడుతుంటే ఓదార్చింది తామని.. రైతుల బాధను పంచుకుంది తామని చెప్పారు. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు కాంగ్రెస్, రేవంత్ రెడ్డికి కనువిప్పు కావాలి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్ తెలిపారు. బోరబండలో కాంగ్రెస్ రెండేళ్లలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించారు. రోడ్డు విస్తరణ చేయాలని ఇండ్లు కూల్చిన కాంగ్రెసోళ్లు అక్కడ ఎంఐఎం షాపులు మాత్రం కూలగొట్టడం లేదు విస్తరణ చేయడం లేదని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే బుల్డోజర్లు పెట్టి వాటిని కూల్చివేయిస్తానని బండి సంజయ్‌ హెచ్చరించారు.

Also Read: KTR Challenge: మగ పుట్టుక పుడితే రేవంత్ రెడ్డి రా చూస్కుందాం: కేటీఆర్ సవాల్

'రేవంత్‌ రెడ్డి రూపంలో పీనుగలు పీక్క తినేటోడు వచ్చిండు' అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌, ఎంఐఎం నాయకులు చైన్ స్నాచర్స్ వాళ్లతో జాగ్రత్త అని ప్రజలకు సూచించారు. ఎంఐఎంతో జత కడుతున్న కాంగ్రెస్‌ గెలిస్తే ఆడవాళ్ల మెడలో ఉన్న మంగళసూత్రం కూడా గుంజుకుపోతారు జాగ్రత్త అని హెచ్చరించారు. 6 గ్యారంటీలను అమలు చేస్తామని రేవంత్‌ రెడ్డి మాట తప్పాడని బండి సంజయ్‌ మండిపడ్డారు.

Also Read: Schools Holiday: రేపు స్కూళ్లతోపాటు ఉద్యోగులకు సెలవు.. ఎందుకు? ఎక్కడో తెలుసా?

'హైదరాబాద్ అభివృద్ధిపై లెక్కాపత్రంతో చర్చించేందుకు మేం సిద్ధం. మేం అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మతం గురించి మాట్లాడుతున్నాడు. వాళ్లవి లక్ష ఓట్లు మాత్రమే మరి మన ఓట్లు 3 లక్షలు ఓట్లు. కానీ వాళ్ల ఓట్ల కోసం ఒవైసీ సంకనాకుతున్నాడు' అని రేవంత్ రెడ్డి తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము చెప్పినట్లు వినాల్సిందేనని ఒవైసీ చెప్పినా పౌరుషం లేని దద్దమ్మలు కాంగ్రెసోళ్లు అని మండిపడ్డారు.

ఒక వర్గం ఓట్ల కోసం టోపీ పెట్టుకున్న రేవంత్ రెడ్డిని చూస్తే సినిమా యాక్టర్ వేణుమాధవ్ గుర్తుకొచ్చాడని బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. రేవంత్ టోపి పెట్టుకుంటే పక్కనే ఉన్న అజారుద్దీన్ కూడా ఓట్ల బిచ్చగాళ్ల లెక్క చూసి నవ్వుతున్నాడని తెలిపారు. రేవంత్ రెడ్డి 40 వేల బురఖాలను తెప్పించాడట? బురఖాలు వేయించి దొంగ ఓట్లు వేయించుకుని గెలవాలని చూస్తున్నాడు అని బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగ ఓట్లపై నజర్ పెట్టాలని ఎన్నికల సంఘానికి బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీలను చూస్తుంటే నా రక్తం మరుగుతోందని తెలిపారు. చార్మినార్‌పై కాషాయ జెండా ఎగరేసేదాకా పోరాడతానని ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News