Private Colleges Bandh: అన్నింట్లో ఫెయిలైన రేవంత్ రెడ్డి.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడంలో కూడా ఫెయిలవడమే కాకుండా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలను బ్లాక్ మెయిల్‌కు పాల్పడడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే ప్రెస్‌మీట్‌లో మరోసారి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలను తీవ్రంగా తప్పుబడుతూ.. వారిని బెదిరింపులకు పాల్పడడం రాజకీయంగా వివాదాస్పదమైంది. ఈ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Udyogini Scheme: మహిళలకు ఈ పథకం ఓ వరం.. వడ్డీ లేకుండా రూ.3 లక్షలు ఇలా!
'ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే బ్లాక్ మెయిల్ చేస్తారా? అసెంబ్లీ సాక్షిగా ప్రతినెల రూ.500 కోట్ల చొప్పున ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తానని రేవంత్ రెడ్డి మాట ఇచ్చింది నిజం కాదా?' అని రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తామని టోకెన్లు ఇచ్చి మోసం చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఒక్క రూపాయి కూడా బకాయి చెల్లించకుండా కాలేజీ యాజమాన్యాలను మోసం చేస్తోంది నిజం కాదా? అని రేవంత్ రెడ్డి తీరుపై బండి సంజయ్ మండిపడ్డారు.
Also Read: Viral Video: హైదరాబాద్‌లో ఆటో డ్రైవ్ చేస్తూ అమ్మాయితో సరసాలు.. వీడియో వైరల్
'రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోతే... మరి టోకెన్లు ఎందుకు ఇచ్చినట్లు? అసెంబ్లీ సాక్షిగా ఎందుకు హామీ ఇచ్చినట్లు? చట్టసభలో ఇచ్చిన హామీకే విలువ లేకుంటే ఇక అసెంబ్లీకి విలువ ఏముంది?' అని రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే తెలంగాణ రూ.7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని రేవంత్ రెడ్డే చెప్పారు కదా? అని గుర్తుచేశారు. ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడం దుర్మార్గం అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: School Holidays: విద్యార్థులకు త్రిబుల్ ధమాకా.. వరుసగా 3 రోజులు స్కూళ్లకు సెలవు
'ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోతే కాలేజీలు ఎట్లా నడవాలి? అధ్యాపకులకు జీతాలివ్వకపోతే విద్యార్థులకు చదవు చెప్పేదెవరు? కాలేజీ యాజమాన్యాలపై రేవంత్ రెడ్డికి ఉన్న కోపంతో విద్యార్థుల జీవితాలను బలి చేయాలనుకుంటున్నారా? ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. చట్టం పేరుతో బెదిరింపులకు పాల్పడితే పాలన నడవదనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని సూచించారు.
Also Read: Jubilee Hills: పీనుగలు పీక్క తినేటోడు వచ్చిండు.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించి చట్టం గురించి మాట్లాడితే మంచిది అని రేవంత్ రెడ్డికి బండి సంజయ్ హితవు పలికారు. అసలు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగిస్తారా? ఎత్తి వేస్తారా? ప్రజలకు స్పష్టం చేయాలని రేవంత్ రెడ్డికి ఆల్టిమేటం జారీ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించేదాకా విద్యార్థులు, అధ్యాపకులు, కాలేజీ యాజమాన్యాలు చేసే ఆందోళన కార్యక్రమాలకు బీజేపీ మద్దతు కొనసాగుతుందని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









