)
Bathukammakumta: ఇక ఈ ఆధునిక బతుకమ్మ కుంట చెరువును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. దీంతో ఈ సారి బతుకమ్మ ఉత్సవాలు ఈ బతుకమ్మకుంట చెరువులోనే జరుగనున్నాయి. అందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ ప్రాంతానికి బతుకమ్మ కుంట అని పేరు ఉన్నా.. ఎక్కడా కుంట అనేది కనపడేది కాదు. కబ్జా కోరల్లో చిక్కుకుపోయింది. అలాగే మాసాబ్ ట్యాంక్ ప్రాంతంలో ట్యాంక్ అనేదే అదృశ్యమైంది. ఇక హైడ్రా కూడా ఓల్డ్ సిటీలో ఒవైసీ ఇలాకాను టచ్ చేయకుండా మిగతా హైదరాబాద్ లో చెరువులను కుంటలను కాపాడే బాధ్యతను నెత్తిన వేసుకుంది. అటు పాతబస్తీలో ఓవైసీ సోదరుల కబ్జా కోరల్లో చిక్కుకున్న చెరువులు, కుంటలను పున:రుద్దరిస్తే.. హైడ్రాకు సలామ్ కొట్టాల్సిందే.
హైదరాబాద్ నగరంలోని బాగ్ అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట ఆక్రమణకు గురైంది. పెద్దమొత్తంలో భవంతులు వెలిశాయి. మిగిలిన కొద్ది స్థలం కూడా కబ్జాదారుల చేతుల్లో చిక్కుకుంది. దాన్ని వాహనాల పార్కింగ్ స్థలంగా వినియోగించుకునేవారు. ముళ్ల కంపలు, చెత్తాచెదారం వేసేవారు. హైడ్రా ఏర్పాటైన తర్వాత బతుకమ్మ కుంట ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ డాక్యుమెంట్లు ఆధారాలుగా చూపారు కొందరు వ్యక్తులు.
దీంతో రంగంలోకి దిగిన హైడ్రా, ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొంది. అక్కడ భారీ యంత్రాలతో తవ్వగా కొద్ది మీటరు లోతులోనే నీరు ఉబికి పైకి వచ్చింది. దీంతో అక్కడ చెరువువుంది అని నిరూపించింది. హైడ్రా ప్రయత్నానికి వరణుడు తోడయ్యాడు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కుంటలో నిండుగా నీరు చేరింది. చెరువుకు జలకళ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను అక్కడే నిర్వహించాలని నిర్ణయించింది.
సాయంత్రం బతుకమ్మ కుంటను ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు అంకితం చేయనున్నారు. హైడ్రా చొరవతో జీహెచ్ఎంసీ, నీటిపారుదల, రెవెన్యూ శాఖల సహకారంతో కుంటకు ఊపిరి పోశారు. ఇక దాదాపు రూ.7.15 కోట్లు వెచ్చించి ఆధునికీకరణ పనులు చేపట్టింది. పిక్నిక్ స్పాట్‌గా తీర్చిదిద్దింది. చిన్న పిల్లలు ఆడేందుకు ఆటస్థలం, వృద్ధులు సేద తీరేందుకు బెంచీలు తదితరాలు ఏర్పాటు చేసింది. చుట్టూ మెట్లతో కాంక్రీట్ గోడ కట్టింది. ఇక ఆధునిక బతుకమ్మ కుంట చెరువును అంబర్‌పేటలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు. బతుకమ్మ కుంట తరహా పాత బస్తీ సహా అన్ని ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన చెరువులను కబ్జా కోరుల బారి నుంచి హైడ్రా రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. మరి హైడ్రా .. బతుకమ్మ కంట విషయంలో చూపిన చొరవ.. మిగతా వాటి విషయంలో చూపుతుందా అనేది వెయిట్ అండ్ సీ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.