Big python spotted near bachupally apartment Hyderabad video: ఇటీవల కాలంలో హైదరాబాద్ లో తరచుగా పాములు, కొండ చిలువలు ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల మూసి ఉప్పొంగిన తర్వాత ఓల్డ్ సిటీలోని పలు ప్రదేశాలతో పాటు, అనేక ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చేసింది.
ఇటీవల ఎంజీబీఎస్ పరిసర ప్రాంతంలో కూడా భారీ కొండ చిలువ కన్పించింది. ఈ క్రమంలో తరచుగా పాములు, కొండ చిలువలు బైటకు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. తాజాగా.. ఒక భారీ కొండ చిలువ ఏకంగా సెకండ్ ఫ్లోర్ వరకు వచ్చింది. ఈ ఘటన బాచుపల్లిలో చోటు చేసుకుంది.
Panic in Bachupally, Hyderabad! ? A python spotted on the 2nd floor of an apartment near Reddy Lab. Residents alerted Snake Society, which safely captured & released it into the forest. Authorities investigating how it reached the upper floor. #Hyderabad #SnakeAlert pic.twitter.com/NDMA1SscU7
— Madhuri Adnal (@madhuriadnal) October 8, 2025
బాచుపల్లిలోని రెడ్డీస్ ల్యాబ్ సమీపంలోని ఒక అపార్ట్మెంట్ లో భారీ కొండచిలువ ఒకటి ప్రత్యక్షం కావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అది ఏకంగా రెండో అంతస్తులోని గదిలోకి దూరడంతో అపార్ట్ మెంట్ వాసులు టెన్షన్ కు గురయ్యారు. వెంటనే స్నేక్ టీమ్ కు, పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన సిబ్బంది.. కొండ చిలువను జాగ్రత్తగా కొన్ని గంటల పాటు శ్రమించి బంధించారు. పలు మార్లు అది దాడికి ప్రయత్నించింది. మెల్లగా దాన్ని బంధించి ఒక పెద్ద సంచిలో వేశారు.ఆ తర్వాత దగ్గరలోని అడవిలో వదిలేశారు. దీంతో అపార్ట్ మెంట్ వాసులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









