Chandrababu Shock: తెలంగాణలో చంద్రబాబుకు భారీ షాక్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీలో భారీ చేరికలు

Big Shock To Chandrababu In Telangana: తెలంగాణలో చంద్రబాబుకు భారీ షాక్‌ తగిలింది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక వేళ బీఆర్‌ఎస్‌ పార్టీ జోరు పెరుగుతోంది. తాజాగా టీడీపీకి చెందిన సీనియర్‌ నాయకులు గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 14, 2025, 02:37 PM IST
Chandrababu Shock: తెలంగాణలో చంద్రబాబుకు భారీ షాక్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీలో భారీ చేరికలు

BRS Party Joinings: తెలంగాణలో నామరూపాల్లేకుండా పోయిన టీడీపీకి జీవం పోయాలని భావిస్తున్న చంద్రబాబుకు భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు రాజీనామా చేశారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల వేళ టీడీపీని వీడి వారంతా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీలో చేరారు. హైదరాబాద్‌లో కొద్ది మొత్తంలో ఉన్న నాయకులు కూడా గులాబీ పార్టీలో చేరడంతో టీడీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కాగా వరుస చేరికలతో బీఆర్‌ఎస్‌ పార్టీ మరింత బలం పెరిగింది.

Add Zee News as a Preferred Source

Also Read: Fake Votes: దొంగ ఓట్లు, డూప్లికేట్‌ ఓట్లు రేవంత్‌ రెడ్డి సృష్టి.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై కేటీఆర్‌ ఆరోపణలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలీ మస్కతి, తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు షకీలా రెడ్డి మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ‌లో చేరారు. హైదరాబాద్‌లోని నందినగర్‌లో కేటీఆర్‌ నివాసంలో వారంతా గులాబీ కండువా కప్పుకున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంతరం అలీ మస్కతి, షకీలా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో యువ నాయకులు రోహిత్ శర్మ కూడా బీఆర్‌ఎస్‌లో చేరారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ విజయం కోసం తాము అంకితభావంతో పనిచేస్తామని ప్రకటించారు.

Also Read: Schools Holiday: స్కూళ్లకు 13 రోజుల సెలవులు.. నేటి నుంచి ఎప్పటివరకంటే..?

సెక్యులర్‌ నాయకుడు కేసీఆర్‌
'బీఆర్‌ఎస్ ఒక సెక్యులర్ పార్టీ. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ కాదు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో ముస్లిం మైనారిటీల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకు ఏమీ చేయలేదు. కేసీఆర్ నిజమైన సెక్యులర్ నాయకుడు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు' అని రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీపై అలీ మస్కతి తీవ్ర విమర్శలు చేశారు.

Also Read: PM Surya Ghar: విద్యుత్‌ బిల్లుతో బాధపడేవారికి జాక్‌పాట్‌.. ఈ పథకంతో రూ.78 వేలు

'టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో.. కేటీఆర్ ఆధ్వర్యంలో పనిచేయడానికి నేను బీఆర్‌ఎస్ పార్టీ‌లో చేరాను. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి తప్ప.. ఇప్పుడు అధికారంలో ఉన్నవారు కొత్తగా చేసిందేమీ లేదు. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కేసీఆర్ పాలన మళ్లీ రాష్ట్రంలో తీసుకురావడం కోసం మేము కృషి చేస్తాం' అని టీడీపీ మాజీ నాయకురాలు షకీలా రెడ్డి తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News