)
Final Voters List: బీఆర్ఎస్ పార్టీ కంచుకోట జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి అనివార్యంగా ఏర్పడిన ఉప ఎన్నికలో కీలక పరిణామం జరిగింది. ఉప ఎన్నికకు సంబంధించిన తుది ఓటర్ల జాబితా విడుదలైంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన లిస్ట్ ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,000గా ఉంది. ఈ విషయాన్ని ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. తుది జాబితా విడుదల కావడంతో త్వరలోనే ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.
ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూలై 1, 2025ను అర్హత తేదీగా తీసుకుని సవరించిన జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. లింగ నిష్పత్తి ప్రతి వెయ్యి పురుషులకు 924 మహిళలుగా ఉందని ఓటరు జాబితాలో ఈసీ తెలిపింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్ల వివరాలు
మొత్తం ఓటర్లు 3,99,000
పురుష ఓటర్లు 2,07,382
మహిళా ఓటర్లు 1,91,593
ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 25 మంది
యువ ఓటర్లు (18–19 సంవత్సరాలు)
6,106 మంది
వృద్ధులు (80 ఏళ్లు పైబడిన వారు)
2,613 మంది
దివ్యాంగ ఓటర్లు
1,891 మంది (519 మంది చూపు లేనివారు, 667 మంది శారీరక వైకల్యం, 311 మంది వినికిడి/మాట లోపం, ఇతర వైకల్యం 722 మంది)
విదేశీ ఓటర్లు
95 మంది
కొత్త ఓటర్లు ఆరు వేలు
సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేసిన ప్రాథమిక జాబితాలో 3,92,669 ఓటర్లు ఉన్నారు. సవరణల తరువాత 6,976 మంది కొత్తగా చేరారు. 663 మందిని తొలగించారు. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,982కి చేరింది. సేవా ఓటర్లను కలుపుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తుది ఓటర్ల సంఖ్య 3,99,000గా ఉంది. దాదాపు నాలుగు లక్షలకు చేరువగా ఉన్న ఓటర్లకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహణకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook