Divvala Madhuri Arrest: బిగ్‌బాస్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి, భర్త ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ అరెస్ట్? లిక్కర్ పార్టీ భగ్నం

Bigg Boss Contestant Divvala Madhuri Birthday Party Break At Farmhouse: తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ దివ్వెల మాధురి, ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్‌తో అరెస్టయినట్లు సమాచారం. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించుకుంటుండగా పోలీసులు భగ్నం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 12, 2025, 08:35 AM IST
Divvala Madhuri Arrest: బిగ్‌బాస్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి, భర్త ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ అరెస్ట్? లిక్కర్ పార్టీ భగ్నం

Divvala Madhuri Birthday: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన దివ్వెల మాధురి, ఆమె భర్త ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారని సమాచారం. ఒక ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరిట నిర్వహిస్తున్న ఈవెంట్‌ను పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు దాడి చేయగా కొందరు పరారయ్యారు. దివ్వెల మాధురి బర్త్‌డే పార్టీని భగ్నం చేసి పోలీసులు వారందరినీ స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన తెలంగాణతోపాటు ఏపీలో తీవ్ర సంచలనం రేపుతోంది. కాగా ఈ పార్టీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు ఉండడం గమనార్హం. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Chandrababu: బస్సు ప్రమాదంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.. సహాయ చర్యలకు ఆదేశం

ఏపీలోని వైఎస్సార్‌సీసీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన భార్య, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ దివ్వెల మాధురి పుట్టినరోజు సందర్భంగా గురువారం రాత్రి హైదరాబాద్‌ శివారులోని మొయినాబాద్‌లో బర్త్‌డే పార్టీ నిర్వహించారు. మొయినాబాద్‌లోని ది పెండెంట్‌ ఫామ్ హౌస్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు, కొందరు టాలీవుడ్‌ ప్రముఖులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో పార్టీ నిర్వహిస్తున్నారని సమాచారం అందింది. అనుమతి లేకుండా పార్టీ నిర్వహిస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు.

Also Read: Sarpanch Results: సర్పంచ్‌ ఎన్నికల్లో బిగ్‌ ట్విస్ట్‌.. చనిపోయినా సర్పంచ్‌గా గెలిచాడు

బర్త్‌డే పార్టీని భగ్నం చేసి దువ్వాడ శ్రీనివాస్‌తోపాటు దివ్వెల మాధురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బర్త్‌డే పార్టీలో మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దువ్వాడ శ్రీనివాస్ మొదటి భార్యను వదిలేసి 2024లో దువ్వాడ మాధురిని వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 12వ తేదీన మాధురి బర్త్‌ డే సందర్భంగా మొయినాబాద్‌లో పార్టీ నిర్వహించగా.. దానిని పోలీసులు భగ్నం చేశారు.

Also Read: Govt Employees: ఉద్యోగులకు బిగ్‌ అలర్ట్‌.. టేక్‌ హోం శాలరీపై కీలక ప్రకటన

బర్త్‌ డే పార్టీకి వేదికగా నిలిచిన పెండెంట్ ఫామ్ హౌస్‌పై పోలీసుల కేసు నమోదు చేశారని సమాచారం. పార్టీ నిర్వాహకుడు పార్థసారథి, ఫామ్‌హౌస్ యజమాని సుభాశ్‌పై కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. దువ్వాడ మాధురి, శ్రీనివాస్‌తో కలిపి 29 మంది పార్టీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్టీలో 10 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల దివ్వెల మాధురి బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. తన మాటలు, చేష్టలతో హౌస్‌లో హల్‌చల్‌ చేసిన ఆమె ఇప్పుడు అరెస్ట్‌ కావడం చర్చనీయాంశమైంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News