Lankala Deepak reddy as jubilee bypoll bjp candidate: ప్రస్తుతం తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అన్ని పార్టీలు ఎలాగైన జుబ్లీహిల్స్ బై పోల్ లో తమ సత్తా చాటాలని శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ లు తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి.
కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ను, బీఆర్ఎస్ పార్టీ మాగంటీ సునీతకు అవకాశం ఇచ్చారు. మరోవైపు తాజాగా.. బీజేపీ పార్టీ ఎన్నికల బరిలో ఉండే తమ అభ్యర్థిని అగ్రనాయకత్వం ఫైనల్ చేసింది.
ఈ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును బీజేపీ బుధవారం ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ముగియనుంది.
ఈ క్రమంలో బీజేపీ పార్టీ ముందు అనేక మంది పేర్లు వచ్చాయి. దీంతో.. తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు న్యూఢిల్లీ తీసుకు వెళ్లి.. బీజేపీ అధిష్టానం ముందు ఉంచారు. ఈ క్రమంలో చివరకు పార్టీ పెద్దలు.. లంకల దీపక్ రెడ్డిని వైపు మొగ్గు చూపారు.
మరోవైపు లంకల దీపక్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని, నమ్మిన బంటు అని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన దీపక్ రెడ్డి, సుమారు 25 వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఈ సమీకరణాల్ని పరిగణలోకి తీసుకున్న బీజేపీ అగ్రనాయకత్వం లంకల దీపక్ రెడ్డికి అవకాశం కల్పించినట్లు సమాచారం. మొత్తంగా మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించడంతో ఇక మాత్రం తెలంగాణలో రచ్చ రచ్చే అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









