)
BJP Candidate Nomination: ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ దాదాపు విజయం ఖాయం చేసుకోగా.. కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలు కోల్పోయి నైరాశ్యలో ఉండగా.. బీజేపీ ఉనికి కోసం పోటీ చేస్తోంది. ఆలస్యంగా అభ్యర్థిని ఖరారు చేసిన కాషాయ పార్టీ ఉప ఎన్నికలో కీలకమైన నామినేషన్ ఘట్టం పూర్తి చేయనుంది. దీపావళి పండుగ రోజు బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక ప్రకటన చేశారు.
ఈ నెల 21వ తేదీన మంగళవారం రోజు జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. నామినేషన్ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు పాల్గొంటారని వెల్లడించారు. కాగా తమపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. బీజేపీపై మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని సూచించారు. హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు కీలక విషయాలపై మాట్లాడారు. సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, అభ్యర్థి దీపక్ రెడ్డి తదితరులతో కలిసి రఘునందన్ రావు మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
అనంతరం రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఎంఐఎం పార్టీ గూండాల అనుమతితో హైదరాబాద్‌లో బతకాల్సిన పరిస్థితి రావొద్దంటే జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. ఈ ఎన్నికల్లో కన్నీళ్లతో ఒకరు.. కట్టెలతో ఒకరు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కన్నీళ్లకు కరిగినా.. కట్టెలకు భయపడినా హైదరాబాద్ భవిష్యత్ మూసీలో కలవాల్సిన పరిస్థితి వస్తదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, తప్పు డు సర్వేలు వస్తున్నాయని, ఆ సర్వేలు ఎవరు చేశారు? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఏసీ రూంలలో కూర్చుని సర్వేలు చేశారా? అని రఘునందన్ రావు నిలదీశారు. పార్టీల వద్ద జీతం తీసుకొని పనిచేసే వారు కూడా తమ రిక్వెస్ట్‌ను అప్పీల్‌గా స్వీకరించాలని చెప్పారు. తమ పార్టీని డ్యామేజ్ చేయాలనుకుని తప్పుడు వార్తలు, సర్వేలను గుర్తుపెట్టుకుంటామని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook