Brs ktr: రాహుల్ గాంధీ యాడ పడుకున్నవ్.!. మరోసారి నిప్పులు చెరిగిన కేటీఆర్.. మ్యాటర్ ఏంటంటే..?

ktr slams on Rahul Gandhi: పొద్దున దాంక రాజ్యంగంను సంకలో పెట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ ఎక్కడ పడుకున్నాడని బీఆర్ఎస్ కేటీఆర్ ఏకీపారేశారు. అదే విధంగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకం ఆయనకు కన్పించట్లేదా అంటూ మరోసారి ఫైర్ అయ్యారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 17, 2026, 03:46 PM IST
  • రేవంత్ , రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్..
  • ఇదెక్కడి రాజకీయాలు అంటూ సెటైర్ లు..
Brs ktr: రాహుల్ గాంధీ యాడ పడుకున్నవ్.!. మరోసారి నిప్పులు చెరిగిన కేటీఆర్.. మ్యాటర్ ఏంటంటే..?

Brs ktr fires on revanth reddy and mp Rahul Gandhi: తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ల మధ్య మాటల గ్రానైడ్ లు పేలుతూనే ఉన్నాయి. ఎక్కడచాన్స్ దొరికిన కూడా నేతలు ఒకరిపై మరోకరు వాగ్బాణాలు వేసుకుంటున్నారు.  ఇటీవల తెలంగాణలో జర్నలిస్టుల అరెస్ట్ వివాదం అదే విధంగా పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయంపై కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. స్పీకర్  అచ్చం దృతరాష్ట్రుడిలా మారారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పది మంది కాంగ్రెస్ లో చేరిన.. వాళ్ల కండువాలు కప్పుకున్న, కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లలో వారితో కలసి ఫోటోలు, పార్టీలో చేరినట్లు వాళ్లు ప్రకటించిన కూడా తనకు కన్పించడంలేదని అనడం విడ్డూరంగా ఉందన్నారు.

Add Zee News as a Preferred Source

 

అదే విధంగా  ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలితో కాల్చేస్తానన్న రేవంత్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఏవిధంగా పార్టీలోకి కండువ కప్పి ఆహ్వనించాలని ఎద్దేవా చేశారు. మరోవైపు నిరంతరం రాజ్యంగం సంకలో పట్టుకుని తిరిగే ఎంపీ రాహుల్ గాంధీ ఏంచేస్తున్నారని, ఎక్కడ పడుకున్నారంటూ కేటీఆర్ ఏకీపారేశారు.

పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిన స్వర్గీయ  రాజీవ్ గాంధీగారి మనసు బాధపడుతుందని, ఆయన తెచ్చిన చట్టానికి ఆయన కొడుకు తూట్లూ పొడుస్తున్నాడని అన్నారు. కళ్ల ముందు ఇన్ని జరుగుతున్న కూడా స్పీకర్ ఈ విధంగా పిటిషన్ ను కొట్టివేయడం దారుణమన్నారు.

Read more: Teenmar mallanna Video: ఇదంతా బీఆర్ఎస్ డ్రామాలు.!.. మహిళ ఐఏఎస్ వివాదాస్పద కథనాలపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు.. వీడియో..

ఇది తెలంగాణ అసెంబ్లీనే అవమానించడమన్నారు. మరోవైపు ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గతంలో ఐదుగురిని, తాజాగా.. కాలే యాదయ్య, పోచారంశ్రీనివాస్ రెడ్డిని ఇధ్దరికి పార్టీ ఫిరాయింపుల పిటిషన్ వివాదంలో క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News