)
Revanth Reddy Land Scam: పది వేల ఎకరాల ప్రభుత్వ భూములను కారు చౌకగా కట్టబెట్టేందుకు రేవంత్ రెడ్డి హిల్ట్ -పి పాలసీ తీసుకువచ్చిందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ ఆరోపించారు. కేవలం 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి డబ్బులు దండుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పరిశ్రమల స్థాపనకు టీఎస్ఐ పాస్ తెచ్చి 15 రోజుల్లో అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూ దందా కోసం హిల్ట్ పాలసీ తెచ్చిందని ఆరోపణలు చేశారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ కీలక ప్రసంగం చేశారు. పరిశ్రమలకు భూములు ఇచ్చేటపుడే కాదు అమ్మేపుడు కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని సూచించారు. పర్యావరణవేత్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. సోషల్ ఇంపాక్ట్ స్టడీస్ చేయాలని విజ్ఞప్తి చేశారు. 'మంత్రి శ్రీధర్ బాబు లీజు భూములకు హిల్ట్ వర్తించదు అని చెబుతున్నారు. జీవోలో మాత్రం తొమ్మిది వేల ఎకరాల పైనే ప్రస్తావించారు. బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి జీవోలు ఎపుడూ ఇవ్వలేదు పారదర్శకమైన విధానం అమలు చేశాం' అని బండ ప్రకాష్ ముదిరాజ్వివరించారు.
వ్యవసాయ రంగంతో పాటు పరిశ్రమలు నడిపేలా చూడటం ప్రభుత్వ భాద్యత అని రేవంత్ రెడ్డికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ గుర్తుచేశారు. పరిశ్రమలు లేకపోతే ఉపాధి ఎట్లా? అని ప్రశ్నించారు. ఓఆర్ఆర్ అవతలకు పరిశ్రమలు స్థాపింవే అవకాశం పారిశ్రామికవేత్తలకు కల్పించాలని డిమాండ్ చేశారు. బిడ్డింగ్ ద్వారా ఉపయోగంలో లేని పరిశ్రమల భూములను విక్రయించాలనేది చాలా రాష్ట్రాల్లో ఈ పద్దతి అమలు అవుతోందని వెల్లడించారు.
హిల్ట్ పాలసీ రావడానికి వెనుక వేల కోట్ల రహస్య ఒప్పందాలు ఉన్నాయని రేవంత్ రెడ్డిపై మరోసారి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఫ్యూచర్ సిటీలో ఉపాధి కల్పించే పరిశ్రమలు రావడం లేదని చెప్పారు. ఫిలిం యూనిట్లపై ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు తప్ప మానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావడం లేదని తెలిపారు. టీఎస్ఐ పాస్ ద్వారా కొత్తగా ఎన్నో పరిశ్రమలు తెచ్చి పదేళ్ల కేసీఆర్ పాలనలో 18 లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించామని బండ ప్రకాష్ ముదిరాజ్ గుర్తుచేశారు.
హిల్ట్ పాలసీ రద్దు చేసి పారిశ్రామిక భూములు వేలం వేయాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. హిల్ట్‌కు వ్యతిరేకంగా పోరాటాన్ని ఢిల్లీ దాకా తీసుకెళతామని ప్రకటించారు. ప్రభావిత ప్రాంతాల పర్యటనకు ఎనిమిది నిజనిర్ధారణ బృందాలను పార్టీ నియమించిందని.. కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులు ఈ బృందాలకు నేతృత్వం వహించి వేర్వేరు క్లస్టర్లలో పర్యటిస్తారని వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook