Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్ హైకమాండ్‌ కీలక ఆదేశాలు..!

Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది..! పోలింగ్‌కు మరో వారం రోజులే గడువు ఉండటంతో.. సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు..! అయితే కాంగ్రెస్ పార్టీ ప్రచారంపై హైకమాండ్ పెద్దలు నిఘా పెట్టారా..! సీఎంతో సహా మంత్రులు చేస్తున్నా ప్రచారంపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నారా..! అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో మరింత దూకుడు పెంచాలని నేతలను ఆదేశించారా..!   

Written by - G Shekhar | Last Updated : Nov 7, 2025, 02:43 PM IST
Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్ హైకమాండ్‌ కీలక ఆదేశాలు..!

Jubilee Hills By Elections: తెలంగాణ పాలిటిక్స్‌ ను జూబ్లీహిల్స్ బైపోల్ షేక్ చేస్తోంది. బైపోల్ లో గెలిచేందుకు అధికార కాంగ్రెస్ అన్నివిధాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు మంత్రులు కూడా ఉదయం, సాయంత్రం.. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం.. నేతలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం జరుగుతున్న తీరు ప్రజల నుంచి వస్తున్న స్పందనపై కాంగ్రెస్ పెద్దలు నిఘా పెడుతున్నారని సమాచారం. అంతేకాకుండా ఇంచార్జ్ మంత్రుల నుంచి ఎప్పటికప్పడు రిపోర్ట్ లు తెప్పించుకుని నేతలు పనితీరును ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్‌ రెడ్డి మంత్రులతో సమావేశంపై ఎన్నికల ప్రచారంపై దిశానిర్ధేశం చేసినట్టు ప్రచారం సాగుతోంది. 
  
ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే డజన్ కు పైగా మంత్రులు పాగా వేశారు. మరో 30 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే నేతలంతా డివిజన్‌లలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే నేతల ఎన్నికల ప్రచారంపై హైకమాండ్ పెద్దలు ఎప్పిటికప్పుడు రిపోర్టులు తెప్పించుకున్నట్టు తెలిసింది. పలు సెగ్మెంట్లలో  ప్రచారం ఎలా జరుగుతోందని ఏఐసీసీ కార్యదర్శులు రెగ్యులర్‌గా మానిటరింగ్ చేస్తున్నారట. అలాగే అన్ని డివిజన్ల వారీగా కాంగ్రెస్ ప్రభావం ఎలా ఉందని ఇన్ చార్జ్ మంత్రుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారట. అయితే కొన్ని డివిజన్లలో ఎన్నికల ప్రచారంపై ఏఐసీసీ కార్యదర్శులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొన్ని డివిజన్లలో పార్టీకి ఆశించిన స్థాయిలో మైలేజ్ రాలేదనే అభిప్రాయపడ్డారట. ఇకమీదట అయినా ప్రచారం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందని నేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది.
 
మరోవైపు  బైపోల్ ఎన్నికల ప్రచారంలో రోడ్ షోలతో లాభం లేదని ఇంచార్జ్ మంత్రులతో చెప్పినట్టు తెలుస్తోంది. అలాకాకుండా అన్ని డివిజన్లలో గడపగడపకు కాంగ్రెస్ అనే నినాదంతో ముందుకు వెళ్లాలని నేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది. రూరల్ సెగ్మెంట్‌ల తరహాలో ఇక్కడ పనిచేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని సున్నితంగానే ఇంచార్జ్ మంత్రులను ఆదేశించినట్టు తెలుస్తోంది. అర్బన్ ఓటర్లు ఆకట్టుకునే విధంగా క్షేత్రస్ధాయిలో నేతలు పనిచేయాలని చెప్పారట. మరోవైపు ఇప్పటి వరకు డివిజన్లలో జరిగిన ప్రచారం తీరు, పార్టీ మైలేజ్, అభ్యర్ధి గ్రాఫ్​ వంటి వివరాలను వెంటనే ఇవ్వాలని ఏఐసీసీ కార్యదర్శి కోరినట్లు తెలిసింది. వారం రోజుల పాటు క్షేత్రస్థాయిలో పనిచేయాలని, ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించ వద్దని నేతలకు ఆదేశించినట్టు తెలుస్తోంది. 
 
మొత్తంమీద జూబ్లీహిల్స్ బైపోల్‌ను కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్‌కే సవాల్ గా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. రెండో బైపోల్ కావడంతో ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై రెఫరండంగా ఈ ఎన్నికను హైకమాండ్ భావిస్తోందట. అందుకే బైపోల్‌లో గెలుపు కోసం ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు. అందుకే క్షేత్రస్థాయి ప్రచార సరళి, పార్టీ నేతల పనితీరుపై కఠినమైన నిఘా ఉంచినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఏదీఏమైనా ఎన్నికల ప్రచారంలో పాత స్ట్రాటజీని అమలు చేస్తూనే గడపగడపకు ప్రచారాన్ని పెంచేందుకు నేతలు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే మాత్రం.. ఈనెల 14 వరకు ఆగాల్సిందే అంటున్నారు.. 

Add Zee News as a Preferred Source

Read more: ఎయిర్‌టెల్‌ యూజర్‌ల కోసం అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌.. 5జీ స్పీడ్‌తో అల్టిమేట్‌ చీపెస్ట్‌ ప్యాక్‌..!

Read more: పీఎం కిసాన్‌ లేటెస్ట్‌ అప్‌డేట్‌.. 21వ విడుత నిధులు ఎప్పుడంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Trending News