Delhi Bomb Blast: భాగ్యనగరంలో గుజరాత్ ఏటీఎస్..ఉగ్రవాది మొహియుద్దీన్ నివాసంలో సోదాలు..

Delhi Bomb Blast: హైదరాబాద్‌లో ఉగ్రమూలాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ హైదరాబాద్‌లో తనిఖీలు చేపట్టింది.   

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 13, 2025, 11:38 AM IST
Delhi Bomb Blast: భాగ్యనగరంలో గుజరాత్ ఏటీఎస్..ఉగ్రవాది మొహియుద్దీన్ నివాసంలో సోదాలు..

Delhi Bomb Blast: మన దేశంలో ఎక్కడ ఏ ఉగ్రవాద చర్య జరిగినా దాని మూలాలు హైదరాబాద్ లో ఉంటున్నాయి. ఇపుడు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటనకు భాగ్యనగరానికి లింకు ఉందనే విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చాయి. తాజాగా  రాజేంద్రనగర్‌లోని పోర్ట్ వ్యూ కాలనీలో ఐదుగురి స్పెషల్ ఏటీసీ బృందం సోదాలు నిర్వహించింది. ప్రధాన నిందితుడు డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ నివాసంలో గంటన్నరకుపైగా సోదాలు నిర్వహించారు. గుర్తు తెలియని రసాయనం, రైసిన్ విష పదార్థం తయారీకి ఉపయోగించిన ముడి పదార్థాలు, కోల్డ్ ప్రెస్ మిషన్, కంప్యూటర్, పుస్తకాలు, పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. లోకల్ పోలీసులను సైతం లోపలికి ఏటీసీ అధికారులు అనుమతించడం లేదు. 

Add Zee News as a Preferred Source

ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులు ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఆజాద్ సులేమాన్‌ షేక్, మొహమ్మద్‌ సుహేల్ సలీంఖాన్‌ ఇళ్లల్లోనూ ఏటీఎస్ పోలీసులు సోదాలు జరుపుతున్నారు. మొహియుద్దీన్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న రసాయనాలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. 

మరోవైపు ఎర్రకోట వద్ద పేలుడుకు సంబంధించి మరో కీలక విషయం బయటపడింది. ఈ పేలుడుకు కారణమైన కారులో లభించిన నమూనాలతో డాక్టర్‌ ఉమర్ నబీ డీఎన్ఏ మ్యాచ్‌ అయినట్లు తేలిందట. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఎర్రకోట వద్ద పేలుడుకు ముందు ఉమర్‌ కారు నడుపుతున్న సీసీటీవీ దృశ్యాలను అధికారులు గుర్తించారు. దీంతో ఘటన సమయంలో కారులో ఉన్న ఉమర్‌ కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అధికారులు అనుమానించారు. ఈ క్రమంలోనే పుల్వామాలోని అతడి ఫ్యామిలీ మెంబర్స్  నుంచి డీఎన్‌ఏ నమూనాలు తీసుకుని పరీక్షించారు. తాజాగా కారు నుంచి లభ్యమైన డీఎన్‌ఏ ఉమర్‌ నబీదేనని తేలినట్లు తెలుస్తోంది. దీంతో పేలుడు జరిగే సమయానికి అతడు వాహనంలోనే ఉన్నాడని అధికారులు నిర్ధారించారు.

అటు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు చేపట్టిన వేట ముమ్మరం అయ్యింది. ఈ క్రమంలో కుప్వారాలోని తంగ్‌ధార్, జబ్రి అడవి ప్రాంతంలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. భారత ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసు, బీఎస్‌ఎఫ్ బలగాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో హైడౌవుట్‌ను గుర్తించాయి. అక్కడ దాచి ఉంచిన ఆరు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని వెంటనే నిర్వీర్యం చేశారు.

Read more: రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటిని చూశారా.. ఏకంగా మాహిష్మతిని తలదన్నేలా ఉన్న రాజా సాబ్ భవనం..!

Read more: ప్రభాస్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా..! అస్సెట్స్ విషయంలో నిజంగానే బాహుబలి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News