Delhi Red Fort Blast update: కేంద్ర నిఘావర్గాల క్లూతో రంగంలోకి దిగిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అహ్మదాబాద్‌లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. అలాగే జమ్మూకాశ్మీర్- హర్యానా పోలీసుల జాయింట్ ఆపరేషన్లో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. దేశవ్యాప్తంగా కీలక నగరాల్లో ఉగ్రమూలాలున్నట్లు నిఘావర్గాల ధర్యాప్తులో వెల్లడైంది. ఉగ్రవాద కార్యకలాపాల్లో డాక్టర్లు పాలుపంచుకున్నారు. అహ్మదాబాద్ లో పట్టుకున్న ఉగ్రవాదుల్లో ఒకరైన డాక్టర్ మొహినుద్దీన్ సయ్యద్ హైదరాబాద్‌కు చెందినవాడని గుర్తించారు.
హైదరాబాద్ రాజేందర్ నగర్ పరిసరాల్లో నివాసం ఉంటున్న మొహీనుద్ధీన్ సయ్యద్ చైనాలో ఎంబీబీఎస్ చేసి జీవ విషతయారీలో నైపుణ్యం సాధించారు. దేవాలయాల్లో ప్రసాదం, తాగునీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంకుల్లో విషం కలపాలనే విధంగా ప్రయత్నించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దేశంలోని మహానగరాల్లో మాస్ పాయిజనింగ్‌తో భారీగా మానవ ప్రాణాలను బలిగొనాలనేది లక్ష్యంగా ఉగ్రవాదులు ఎంచుకున్నట్లు నిఘావర్గాలు పసిగట్టాయి.
యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ పోలీసులు రాజేందర్ నగర్ మంజిల్ అపార్ట్ మెంట్లో తనిఖీలు నిర్వహించారు. డాక్టర్ మొయినుద్ధీన్ సయ్యద్ నివాసం ఉంటున్న ఇంట్లోంచి జీవ విష తయారీకి వినియోగించిన రసాయనాలు, ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నారు.అహ్మదాబాద్‌లో పట్టుబడిన డాక్టర్ మొయినుద్ధీన్‌ను కార్యకలాపాలపై పోలీసు వర్గాలు ఆరాతీస్తున్నాయి. డాక్టర్‌తో ఉన్న సంబంధాలు, విష ప్రయోగానికి సంబంధించిన కుట్రకోణాలను శోధిస్తున్నారు.
Also Read: మీ ఏజ్ ప్రకారం రోజు ఎంత లిక్కర్ తీసుకోవాలి.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..
Also Read: చిరంజీవికి అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..భార్యగా యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.









