)
Big Shock To Annapurna Ramanaidu Studio: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియో నిర్వాహాకులు గత కొన్నేళ్లుగా తమ వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. వ్యాపారం తక్కువ చూపిస్తూ భారీగా ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అయితే అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన వ్యక్తం కాలేదు.
అన్నపూర్ణ స్టూడియో విషయానికొస్తే.. అక్కినేని నాగేశ్వరరావు ఈ స్టూడియోను తన భార్య పేరు మీద నిర్మించారు. 1975లో అప్పటి రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్ చేతులు మీదుగా సంక్రాంతికి ఈ స్టూడియో ప్రారంభమైంది. ఈ స్టూడియోలో రామానాయుడు సురేశ్ ప్రొడక్షన్స్ కు చెందిన ‘సెక్రటరీ’ సినిమాను తెరకెక్కించారు. మొత్తంగా హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియో ప్రారంభించి భాగ్యనగరంలో సినీ పరిశ్రమ వేళ్లూనుకునేలా చేసారు. ఇక్కడ అన్ని రకాల సినిమాలు, రియాల్టీ షోలతో పాటు సీరియల్స్ షూటింగ్ నిరంతరం జరగుతూ ఉంటాయి. మరోవైపు రామానాయుడు స్టూడియో కూడా దివంగత రామానాయుడు ప్రారంభించారు.
1990 లలో ప్రారంభమైన రామానాయుడు స్టూడియో మన రాష్ట్రంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టూడియోల్లో ఒకటి. ఇక్కడ డబ్బింగ్ సహా ఇతరత్రా సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు జరగుతూ ఉంటాయి. ఎక్కడో తుప్పల్లో, కొండల్లో ఉన్న ఈ ప్రాంతాలను తొలిచి మరి ఈ స్టూడియోలను నిర్మించారు. అపుడు వాళ్ల వేసిన పునాదితో అక్కడ చుట్టు పక్కల ప్రాంతాలు కూడా ఎంతో అభివృద్ది చెందాయి. తాజాగా జీహెచ్ఎంసీ ఇచ్చిన నోటీసులపై నాగార్జున, సురేశ్ బాబు ఎలా స్పందిస్తారనేది చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.