Harish rao fires on cm revanth reddy over phone tapping case allegations: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దీనిలో అనేక మంది అధికారుల్ని సిట్ విచారించింది. ఇక ఇది కాస్త మున్సిపల్ ఎన్నికల సమీపిస్తున్న వేళ పొలిటికల్ టర్న్ తీసుకుంది. నిన్న రాత్రి (సోమవారం) బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ అధికారులు తమ ఎదుట మంగళవారం హజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఈ ప్రకారమే మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు హజరయ్యే ముందు తెలంగాణ భవన్ కు వచ్చారు.
బిడ్డా రేవంత్ జాగ్రత్త.. నీ నోటీసులకు, బెదిరింపులకు, తాటకు చప్పుళ్లకు భయపడేది లేదు
రేపు మున్సిపల్ ఎన్నికల్లో మీకు ప్రజలు దిమ్మతిరిగే జవాబు చెప్తారు జాగ్రత్త - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు pic.twitter.com/wxqGHKnI6a
— Telugu Scribe (@TeluguScribe) January 20, 2026
మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కీలక నేతలు తెలంగాణ భవన్ కు వచ్చారు. జూబ్లిహిల్స్ పోలీసుల ముందు హజరు కాబోయే ముందు హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమన్నారు. బొగ్గుగనుల స్కామ్ ను డైవర్షన్ చేసేందుకు, వాటాల పంచాయతిని పక్కన పెట్టడానికి మాత్రమే సీఎం రేవంత్ ఈ నోటీసుల డ్రామాకు తెరతీశాడన్నారు.
గతంలోనే సుప్రీంకోర్టు తనపై కేసు నమోదుపై పిటిషన్ ను కొట్టివేసిందని అన్నారు. ఇచ్చిన 420 హమీలను అమలు చేయమంటే ఈ విధంగా ప్రశ్నిస్తున్న వారి గొంతులు నొక్కేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నాడన్నారు. ఇలాంటి కేసులు, వేధింపులకు భయపడేదిలేదని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ హయాంలో ఎన్నో కేసుల్ని, వేధింపుల్ని ఎదుర్కొన్నామన్నారు.
అదే విధంగా ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో సరైన విధంగా బుద్ది చెప్తారన్నారు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు, కేసులకు ఎవరు భయపడరని మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణకు హజరవుతున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భారీగా పోలీసుల్ని మోహరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









