KCR Deeksha Divas: మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం తథ్యం.. ఇదే నా మాట

Harish Rao Speech In KCR Deeksha Divas: తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. చరిత్రలో కేసీఆర్‌ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించదగిదని.. తెలంగాణకు ప్రధాన ద్రోహి కాంగ్రెస్‌ అని ప్రకటించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 9, 2025, 10:57 PM IST
KCR Deeksha Divas: మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం తథ్యం.. ఇదే నా మాట

Harish Rao: తెలంగాణ ఉద్యమ సమయంలో దీక్ష చేస్తున్న కేసీఆర్‌ ప్రాణం పోతున్నా తనకు ఏమీ కాదని చెప్పారని.. అయితే శవయాత్ర.. లేకుంటే జైత్రయాత్ర అవుతుందని మాజీ మంత్రి హరీశ్‌ రావు గుర్తుచేసుకున్నారు. ఉద్యమంలో ఆమరణ దీక్ష, పోరాటంతో తెలంగాణ వచ్చిందని ప్రకటించారు. దేవుని దయ, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో కేసీఆర్‌ చాలా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఆమరణ దీక్ష సమయాన్ని నెమరువేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.

Add Zee News as a Preferred Source

Also Read: Free Bus Scheme: ఆర్టీసీ ఫ్రీ బస్సుకు రెండేళ్లు పూర్తి.. తెలంగాణ ఉచిత బస్సుపై బిగ్ అప్డేట్

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విజయ్ దివస్‌లో మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రసంగించారు. 'ఇప్పుడు ఆ సోనియా గాంధీకి గుడి కడతామంటున్నాడు. నాడు తెలంగాణ వెనక్కి తీసుకున్నప్పుడు మన యువకులు బలిదానాలు చేసుకున్నారు. సోనియాగాంధీ పేరు మీద ఉత్తరం రాసి ఏఐసీసీ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకున్నారు యాదిరెడ్డి. యాదిరెడ్డి పార్థివ దేహాన్ని ఏపీ భవన్‌కు కూడా రానివ్వని దుర్మార్గపు పాలన అది' కాంగ్రెస్‌ ఘోరాలను మాజీ మంత్రి హరీశ్‌ రావు వివరించారు. 'ఎన్ని త్యాగాలు, ఎన్ని పోరాటాలు. కేసీఆర్ అంటేనే త్యాగాలు. బహుశా దేశంలో ఒక డిమాండ్‌ కోసం ఇన్ని పదవులకు రాజీనామా చేసిన నాయకుడు ఎవరైనా ఉంటే అది కేసీఆర్. పదవులే కాదు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డ గొప్ప నాయకుడు కేసీఆర్' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

Also Read: Harish Rao: కేసీఆర్ అంటే పోరాటం, త్యాగం.. రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, ద్రోహం

'నిమ్స్‌లో కేసీఆర్‌కు సోడియం లెవెల్స్ తగ్గిపోయాయి. కిడ్నీ ఫెయిల్ అయిపోతాయి. మనిషి చనిపోతాడని డాక్టర్లు  మాకు చెప్పారు. నేను పోయి కేసీఆర్‌కు దీక్ష విరమించుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తే, నాకే తిరిగి ధైర్యం చెప్పి తెలంగాణ వచ్చేవరకు నా ప్రాణం పోదు మనం కొట్లాడుదామని కేసీఆర్‌ చెప్పాడు' అని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. అయితే జైత్రయాత్ర లేకపోతే శవయాత్ర అని కేసీఆర్ తేల్చి చెప్పారని తెలిపారు.

Also Read: School Holiday: రేపు అన్నీ పాఠశాలలకు సెలవు.. ఎక్కడెక్కడ ఇచ్చారో తెలుసా?

'నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి అని చెప్పిన గొప్ప నాయకుడు. ఆయన ఉద్యమంలో ఆమరణ దీక్ష, పోరాటంతో వారి ఆయుష్షు పది సంవత్సరాలు తగ్గింది. దేవుని దయ, తెలంగాణ ప్రజల ఆశీస్సులతో చాలా ఆరోగ్యంగా ఉన్నారు కేసీఆర్ ఇప్పుడు. తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ పోరాటం చేస్తారు. కచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. ​ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పదాన్నే నిషేధించారు. తెలంగాణ వెనుకబడ్డది కాదు వెనుకబడేయబడ్డది అని జయశంకర్ సార్ చెప్పేవారని తెలిపారు.

Also Read: Govt Employees: పంచాయతీ ఉద్యోగులకు జీతం ఎంత ఉంటుంది? గ్రేడ్ల వారీగా జీతభత్యాలు ఇవే!

'కేసీఆర్ పోరాటంతో తెలంగాణ రావడంతోనే నేడు 24 గంటల విద్యుత్‌, ఇంటింటికి నీళ్లు, కోటి ఎకరాల మాగాణి సాధ్యమైంది. తలసరి ఆదాయంలో.. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచింది. కానీ నేడు రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణను మళ్లీ వెనుకబడేసే కుట్ర జరుగుతోంది' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. సమైక్యవాదుల బాటలో నడుస్తూ రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడని ఆగ్రహం వ్యకతం చేశారు. ప్రజల పక్షాన కేసీఆర్ మళ్లీ పోరాటం చేస్తారని.. కచ్చితంగా మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. ఈ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించి ఉంటుందని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News