)
Heavy Rains in Two States: తెలంగాణలో బీభత్సం సృష్టిస్తున్న కుండపోత వానలు. ఈ రోజు రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు. ములుగు, కరీంనగర్, వికారాబాద్, నిర్మల్, భూపాలపల్లి, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జగిత్యాల, మహబూబాబాద్, నిజామాబాద్, వరంగల్, సిరిసిల్లా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాత్రి నుంచే హైదరాబాద్ సహా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కుండపోత వర్షంతో తడిసి ముద్దవుతోంది. ఇప్పటికే లోతట్టు కాలనీల్లోకి వర్షపు నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, కిస్మత్పూర్, గండిపేట్, అత్తాపూర్, ఆరాంఘర్, ఇందిరా పార్క్, గాంధీ నగర్, శంషాబాద్, చైతన్యపురి, కుత్బుల్లాపూర్, సూరారం, జీడిమెట్ల, చింతల్ సహా పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లపై వరదనీరు పారుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మరోవైపు తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
రెండు రోజుల పాటు భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని, వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ట్రాఫిక్ నిలిపివేయాలని అన్నారు. వర్షం కురిసే టైంలో ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావొద్దని సీఎం సూచించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు.
రాష్ట్రంలో 15 జిల్లాలకు వాతావరణ శాఖ అతి భారీ వర్ష సూచన చేసింది. నేడు కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 సెం.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అవసరం అయితే తప్ప బయటకు రాకూడదని స్పష్టం చేసింది. హైదరాబాద్ లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా వరద పరిస్థితులను, వరదలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.