Video: హైదరాబాద్‌లో అమానుషం.. దారుణంగా నేలకేసి కొట్టి 11 ఏళ్ల కొడుకును పొట్టనబెట్టుకున్న పినతండ్రి, సీసీ ఫూటేజ్‌..!

Man Kills 11 Years Old Stepson Video: హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 11 ఏళ్ల బాలుడిని తండ్రి నేల కోసి కొట్టి పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటన చాంద్రాయణగుట్టలో చోటుచేసుకుంది. అయితే డిసెంబర్ 7వ తేదీనే ఈ ఘటన జరిగింది కానీ డిసెంబర్ 12వ తేదీ శుక్రవారం బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ సీసీ టీవీ ఫుటేజ్ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : Dec 14, 2025, 08:29 AM IST
Video: హైదరాబాద్‌లో అమానుషం.. దారుణంగా నేలకేసి కొట్టి 11 ఏళ్ల కొడుకును పొట్టనబెట్టుకున్న పినతండ్రి, సీసీ ఫూటేజ్‌..!

Man Kills 11 Years Old Stepson Video: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి ఓ బాలుడిని కానరానిలోకానికి పంపించాడు.. హైదరాబాద్ నడిబొడ్డున 11 ఏళ్ల బాలుడిని పొట్టన పెట్టుకున్నాడు ఓ మృగం. దారుణంగా నేలకేసి కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపై ఆ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచాడు. కేవలం పిల్లలతో ఆడుకోవద్దని చెబుతూ తండ్రి ఆ బాలుడిపై ఈ దారుణ ఘటనకు ఒడిగట్టాడు. ఈ ఘటన అంతా స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయింది. పోలీసుల వివరాల ప్రకారం ఉంటున్న చాంద్రయాణ గుట్ట ఘాజీ ఇ మిల్లత్‌లో నివాసముంటున్న షేక్ ఇమ్రాన్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే ఇతను ఆ బాలుడు తల్లి అయినా నఫీస్ బేగంతో 6 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఆమెకి గతంలో పెళ్లి జరిగే డైవర్స్ అయ్యాయి. అయితే మొదటి నుంచే తన కొడుకును అతను ద్వేషిస్తున్నాడని కూడా ఆమె మీడియాతో తెలిపింది. మొదటి భర్త పేరు కూడా అతని ముందు తీయనివ్వకుండా తిట్టేవాడు. నన్ను నా కొడుకును జాగ్రత్తగా చూసుకుంటానని మోసం చేశాడు అని వాపోయింది. ఆ తర్వాతే తెలిసింది అతనికి నిండా అప్పులు ఉన్నాయి. అయితే ఇరుగు పొరుగు పిల్లలతో కూడా అస్గర్‌ను ఆడుకోనివ్వకుండా తిట్టేవాడు. కనీసం కింద ఫ్లోర్ పిల్లలతో కూడా ఆడనివ్వకుండా తిట్టేవాడని తెలిపింది. ఇటీవలే పక్కింటి వారితో కూడా తన కొడుకుతో ఎవరు ఆడకూడదు మాట్లాడకూడదు అని గొడవపడ్డాడని ఆమె పేర్కొంది.

Add Zee News as a Preferred Source

 అయితే అతను చెప్పిన వినకుండా అస్గర్‌ పిల్లలతో ఆడుకుంటున్నాడు. పొరుగువారితో మాట్లాడుతున్నాడు. ఈ నేపథ్యంలో బాబుపై ద్వేషం పెంచుకున్న ఇమ్రాన్ సర్ది చెప్పకుండా కొడుకుని దారుణంగా చంపేశాడు. నేను నా కొడుకుని కోల్పోయానని ఆమె బోరున ఏడ్చింది. ఘటన జరిగిన వెంటనే బాలుడిని స్థానికంగా ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. అయితే వారు గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేశారు. డిసెంబర్ 12వ తేదీ వరకు చికిత్స అనంతరం ఆ బాలుడు చనిపోయాడు.

 మొదట్లో ఆ బాలుడు తమ భవనం నుంచి పడిపోయి తీవ్ర గాయాలపాయాలయ్యారని  ఆమె పోలీసులకు తెలిపారు. కేవలం ఇమ్రాన్‌ చెప్పి బెదిరించినందుకే ఇలా చేశానని ఆమె తెలిపింది. ఆ తర్వాత ఆమె ఫోన్ కూడా లాక్కొని స్విచ్ ఆఫ్ చేశాడు. డిసెంబర్ 10వ తేదీన అతనిపై కేసు పెట్టింది. నఫీజ్‌ బేగంకు ఈ అబ్బాయి తో పాటు 15 ఏళ్ల కూతురు కూడా ఉంది. పోలీసులు ఇలాంటి వారిని నమ్మి మహిళలు మోసపోకూడదని జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.

 

 

వీడియోలో ఏముంది?
 వీడియోలో అబ్బాయి నడుచుకుంటూ వస్తున్నాడు. ఆటో వద్ద ఉన్న సదరు నిందితుడు అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నాడు. అదను చూసి దగ్గరకు వచ్చాక అతనితో ఏదో మాట్లాడాడు. మాట మాట పెరిగి పలుమార్లు అతనిపై చేయి చేసుకున్నాడు. ఆ తర్వాత నేలకేసి బలంగా కొట్టాడు. పక్కనే ఇద్దరు బైకర్‌లు కూడా చోద్యం చూస్తున్నారు. కానీ బాబును రక్షించలేకపోయారు. అక్కడి నుంచి స్పృహ కోల్పోయిన బాబుని ఎత్తుకొని నిందితుడు వెళ్లిపోయాడు.

ఇదీ చదవండి:  న్యూ ఇయర్‌ వేడుకలకు పోలీసుల కొత్తకోడ్‌.. పబ్బులు, క్లబ్బులకు సీపీ ఆదేశాలు..!  

ఇదీ చదవండి:  మెస్సీ ఫ్యాన్స్‌ ఫైర్‌.. రూ.12 వేల టిక్కెట్‌.. 10 నిమిషాలు లేడు, కుర్చీలు గ్రౌండ్‌లోకి విసిరేసి ఆగ్రహం..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News