iBOMMA Ravi: ఎట్టకేలకు iBomma బొమ్మ రవి విడుదల..ఐబొమ్మ కథ మళ్లీ మొదటికి వస్తుందా..!

iBOMMA Ravi Bail News : ఐబొమ్మ రవి ఎట్టకేలకు జైలు నుంచి నేడు విడుదల కాబోతున్నాడు. పైరసీ సినిమాల వెబ్‌సైట్ నిర్వహణ కేసులో అరెస్ట్ అయిన ఐ బొమ్మ రవికి నిన్న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లాస్ట్ ఇయర్ ఇతను నవంబర్ లో పోలీసులు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు.   

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 18, 2026, 11:09 AM IST
  • iBOMMA Ravi: ఐబొమ్మ రవి ఎట్టకేలకు జైలు నుంచి నేడు విడుదల కాబోతున్నాడు. పైరసీ సినిమాల వెబ్‌సైట్ నిర్వహణ కేసులో అరెస్ట్ అయిన ఐ బొమ్మ రవికి నిన్న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లాస్ట్ ఇయర్ ఇతను నవంబర్ లో పోలీసులు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు.
iBOMMA Ravi: ఎట్టకేలకు iBomma బొమ్మ రవి విడుదల..ఐబొమ్మ కథ మళ్లీ మొదటికి వస్తుందా..!

iBOMMA Ravi News: ఐ బొమ్మ నే  పైరసీ సైటుతో మొత్తం సినీ ఇండస్ట్రీని షేక్ చేశాడు ఐ బొమ్మ రవి. గత సంవత్సరం నవంబర్ 16న జరిగిన అరెస్ట్ తర్వాత పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ కోర్టు  అతనికి బెయిల్ ఇవ్వలేదు.  తాజాగా అతను అరెస్టై మూడు నెలలు కావొస్తోన్న నేపథ్యంలో ఐబొమ్మ రవికి ఎట్టకేలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ విషయంలో  కోర్టు పలు షరతులు విధించింది. ప్రతిరోజూ సీసీఎస్ ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. దేశం విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు అతను తన పాస్‌పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇంటర్నెట్‌ను వాడొద్దని, వాడాలనుకుంటే పోలీసుల అనుమతి తీసుకోవాలని కోర్టు తెలిపింది.

Add Zee News as a Preferred Source

మొత్తంగా ఐబొమ్మను అష్ఠదిగ్భంధనం చేసేలా కోర్టు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరి అతను కోర్టు విధించిన షరుతులను పాటిస్తాడా లేదా అనేది చూడాలి. మరోవైపు ఇంటర్నెట్ వాడకుండా అతన్ని కోర్టు నిర్భందం విధించడం వలన పైరసీ చేయకుండా నిరోధించగలిగుతారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. 

 తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్ అయినప్పటిం నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే అతన్ని అరెస్ట్ చేసి జైలు పంపడంపై సినిమా వాళ్లు సంతోషం వ్యక్తం చేస్తే.. కొంత మంది కామన్ ఆడియన్స్  మాత్రం అతన్ని అరెస్ట్ చేయడాన్ని విమర్శిస్తున్నారు. అంతేకాదు అతన్ని వెనకేసుకొస్తున్నారు. టికెట్ రేట్స్ ఎక్కువ పెట్టి చూడలేని ప్రేక్షకులు ఆయన పైరసీ సైట్  లో కేవలం ఇంటర్నెట్ ఛార్జీలపైనే  ఫ్రీగా సినిమాలు చూస్తున్నారు. మొత్తంగా ఈ పైరసీ కేసులో పోలీసులు అతనికి శిక్ష పడేలా చేస్తారా లేదా అనేది చూడాలి. 

Read more:​ Top 10 Richest Actors: మన దేశంలో అత్యంత ధనవంతులైన హీరోలు వీళ్లే.. ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే.

Read more:​ Chiranjeevi Sankranthi Hits:‘మన శంకర వరప్రసాద్ గారు’ సహా సంక్రాంతి బరిలో హిట్టైన చిరంజీవి మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News