)
Jigris Movie Updates: టాలీవుడ్ యూత్‌ఫుల్ కంటెంట్‌కు మంచి క్రేజ్ ఉంది. ఈ నగరానికి ఏమైంది మూవీ తరహాలోనే యూత్‌ను ఆకట్టుకునేందుకు వచ్చేస్తుంది జిగ్రీస్ మూవీ. మ్యాడ్ మూవీతో హిట్ అందుకున్న రామ్ నితిన్‌తోపాటు కృష్ణ బురుగుల, మణి వక్కా, ధీరజ్ అథేర్య ప్రధాన పాత్రల్లో నటించారు. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మించారు. నవంబర్ 14న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుండగా.. ప్రమోషన్స్‌లో దూకుడు పెంచారు మేకర్స్. ఈ సినిమా ప్రమోషన్స్‌కు స్టార్ సెలబ్రిటీలు సపోర్ట్ చేస్తుండడంతో సినిమా మంచి హైప్ క్రియేట్ అయింది.
ఈ మూవీ టీజర్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేయగా.. మొదటి సాంగ్‌ను యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా విడుదల అయింది. తాజాగా మరో సాంగ్‌ను లాంఛ్ చేసింది చిత్రబృందం. ఈసారి యూత్‌ఫుల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ సపోర్ట్ తీసుకుంది. ఆయన చేతుల మీదుగా.. ఓ తాకగా తడి ఏదో.. అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల అయింది. ఈ పాటను చూసిన తరుణ్ భాస్కర్ మేకర్స్‌ను అభినందించారు. సాంగ్‌లో చాలా మంచి ఎమోషన్ ఉందని అన్నారు. మూవీ టీమ్‌తో ముచ్చటించి సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
టెక్నికల్ టీమ్
==> డైరెక్టర్: హరీష్ రెడ్డి ఉప్పుల
==> DOP : ఈశ్వర్ ఆదిత్య
==> మ్యూజిక్ : కమ్రాన్ సయ్యద్
==> ఎడిటర్ : చాణక్య రెడ్డి తూర్పు
==> మ్యూజిక్ లేబుల్ : T-Series
==> డిజిటల్ మార్కెటింగ్ : Big Fish Media
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.