Jubilee Hills By Pole: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కీలకమైన జూబ్లిహిల్స్ బై ఎలక్షన్స్ రావడంతో రాజకీయంగా ఈ ఎన్నిక కాకరేపుతోంది. ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తన వ్యూహాలకు పదును పెడుతోంది. చేతిలో అధికారం కూడా ఉంటంతో సామ,దాన, దండోపాయాలను ఉపయోగించి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. ఓ రకంగా రేవంత్ కు ఈ ఎన్నిక అగ్నిపరీక్ష అని చెప్పాలి. ఒకవేళ ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోతే ఈయన సీఎం పీఠాన్ని కదిలించడానికి అదే పార్టీలో పలువురు నేతలు కాచుకు కూర్చొన్నారు. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకొని గ్రేటర్ లో తమ పార్టీ ప్రభావం ఏ మాత్రం తగ్గలేదని చెప్పే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్. అంతేకాదు అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు.. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు.. ఇపుడు జరుగుతున్న పనులపై ప్రజలే బేరీజు వేసుకోవాలని చెబుతూ ఓటు అడగాలని చూస్తోంది.
మరోవైపు బీజేపీ కూడా కేంద్రంలో గత 11 యేళ్లుగా అధికారంలో ఉన్న నేపథ్యంలో మోడీ అందిస్తూన్న సంక్షేమ పథకాలతో పాటు.. దేశ రక్షణతో పాటు తాజాగా జీఎస్టీ ని భారీగా తగ్గించడంతో పాటు, పలు అంశాలతో పాటు హిందూత్వం.. కాంగ్రెస్ పార్టీ హయాంలో హిందువుల పండగలపై ఆంక్షలు.. ఇతరత్రా అన్ని ఆయుధాలను పట్టుకొని బరిలో దిగబోతుంది.
మరోవైపు జూబ్లీహిల్స్ అభ్యర్థి వేటలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఈ మేరకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అభ్యర్థి ఎంపిక, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. బీసీలకే టికెట్టు అంటూ ఇప్పటికే పీసీసీ చీఫ్ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు నిన్న బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సీఎం భేటీకి సంబంధించిన వివరాలను చర్చించే అవకాశముంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి చెందిన ఎన్నిక నవంబర్ 11న జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగబోతుంది.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘనలపై అధికారుల సీరియస్ అయ్యారు. ఓటర్ కార్డులను నవీన్ యాదవ్ పంపిణీ చేయడం మధురా నగర్ పీఎస్‌లో ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగా ఎన్నికల సంఘం భావిస్తోంది. నవీన్ యాదవ్‌పై బీఎన్‌ఎస్ 170, 171, 174తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేశారు.
Read more: విడాకుల దిశగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. షాక్ కు గురి చేస్తోన్న న్యూస్..
Read more: ఒకే టైటిల్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ హిట్స్ అందుకుంటే.. చిరు డిజాస్టర్ అందుకున్నాడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









