)
BRS Party: 'జూబ్లీహిల్స్‌లో అభ్యర్థి స్వయంగా బెదిరింపులకు దిగుతున్నాడు. ఇప్పుడే ఇలా ఉంటే.. తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలి' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ పైసలు ఇచ్చి గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 'అక్క, చెల్లి, మామ, అల్లుడు అంటూ చేతిలో పైసలు పెట్టే ప్రయత్నం చేస్తారు. పైసలు ఇస్తే తీసుకోండి.. ఓటు మాత్రం బీఆర్ఎస్కు వేయండి' అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 'మోసాన్ని మోసంతోనే జయించాలి. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే రూ.2 వేలు తీసుకొని.. మిగితా రూ.58 వేలు ఎప్పుడిస్తారని ప్రశ్నించాలి' అంటూ సూచించారు. కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ఇవ్వాల్సిన బాకీ డబ్బుల గురించి గట్టిగా నిలదీయాలని చెప్పారు. 4 లక్షల మంది ఓటర్ల వైపు.. నాలుగు కోట్ల మంది ప్రజలు చూస్తున్నారని తెలిపారు. ఇప్పుడు బీఆర్ఎస్కు ఓటేస్తే.. కాంగ్రెస్‌కు బుద్ది వస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
'జూబ్లీహిల్స్‌లో ఓడిస్తేనే రేవంత్ రెడ్డికి మేం తప్పు చేశాం. ప్రజలు కోపంగా ఉన్నారని అర్థమవుతుంది. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే మేం మోసం చేసినా ఏం కాదని భావిస్తారు' అని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలవుతాయని పేర్కొన్నారు. కత్తి వాళ్లకు ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎలా..? అని ప్రశ్నించారు. 'కత్తి మాకు ఇవ్వండి.. వాళ్లతో యుద్ధం చేసే బాధ్యత మాది' అని కేటీఆర్ ప్రకటించారు.
'ఇప్పుడు కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ నష్టపోయేది ప్రజలే. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి. ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే ఏమైనా జరగొచ్చు. మళ్లీ మూడేళ్ల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు. రెండేళ్లలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా?' అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, మహిళలు, వృద్ధులు ఇలా అందరూ బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'కోటి మంది కోటీశ్వరులను చేయడం ఏమిటో కానీ మహిళలకు ఇస్తామన్నవి ఇచ్చేయాలని కాంగ్రెస్ పార్టీకి సూచించారు.
మాట ఇచ్చి మోసం చేసిన వాళ్ల వెంటపడాలని ప్రజలకు మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. 'భర్త చనిపోతే భార్యకు బాధ ఉండదా..? ఆమె మీద కామెంట్ చేయడానికి మంత్రులకు సిగ్గు ఉండాలి. వాళ్ల కుటుంబంలో ఎవరైనా చనిపోతే కాంగ్రెస్ నేతలకు బాధ కలగదా? జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ దొంగ ఓట్లు రాయించినట్లు తెలిసింది. కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడికే మూడు ఓట్లు ఉన్నాయంటా? 12, 13 వేల దొంగ ఓట్లు సృష్టించారు' అని కేటీఆర్ వివరించారు.
'ప్రజలు ఎలాగూ ఓటేయరని తెలిసి.. దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే.. మీ ఓటు కూడా ఎవరో ఒకరు వేసేస్తారు. అది జరగకుండా.. మీరే వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి' అని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. మున్నూరు కాపులకు సముచిత గౌరవం, సముచిత ప్రాధాన్యం ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అని ప్రకటించారు. రూ.73 వేల కోట్లు రైతుబంధు రూపంలో రైతుల అకౌంట్లు వేసిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. రైతులకు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని మంచి పనులు కేసీఆర్ చేశారని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
'రేవంత్ రెడ్డి కరెంటు కూడా సరిగా ఉండట్లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఫ్రీ వాటర్ స్కీం కూడా ఎత్తేస్తారు. ఏదో ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డే ఈ విషయాన్ని బయటపెట్టారు' అని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. 'ఒక్క కొత్త రోడ్డు లేదు.. కొత్త బ్రిడ్జ్ లేదు.. కొత్త బిల్డింగ్ కట్టలేదు. కానీ.. కేసీఆర్ కట్టిన బిల్డింగ్‌లను మాత్రం ఓపెన్ చేస్తున్నారు' అని ఎద్దేవా చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూ బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
'బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తేనే ఇది జరుగుతుందని మేం ముందే చెప్పాం. అయినా.. వాళ్లు నాటకాలు ఆడి మోసం చేసే ప్రయత్నం చేశారు. చివరికి ఈ ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు ఆపేసింది' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 'బీసీలకు రూ.20 వేల కోట్లు ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల బడ్జెట్ అన్నారు.. అదెందుకు ఇవ్వరు' అని ప్రశ్నించారు. 'ఆయన చేతిలో లేని ముచ్చట చెప్తూ.. ఇవ్వాల్సిన వాటి గురించి మాట్లాడారు. పార్లమెంట్లో బిల్లు పెడితే మేం కూడా మద్దతు ఇస్తామని చెప్పాం. కానీ ఆ ప్రయత్నాన్ని మాత్రం రేవంత్ రెడ్డి చేయట్లేదు. నవంబర్ 11వ తేదీన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి. భవిష్యత్తులో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి' అని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి