)
Lecturer molested and vulgar chats with college girls in Hyderabad: ఇటీవల కాలంలో కామాంధులు ఎవరిని వదలడంలేదు. పసిపాప నుంచి పండు ముసలి వరకు అందరిని వేధిస్తున్నారు. అసలు ఎవర్ని నమ్మాలో కూడా అర్థంకాని సిట్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. ఈ క్రమంలో..కొంత మంది పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అమ్మాయిల్ని వేధిస్తున్నారు.
కొన్నిసార్లు అత్యాచారాలకు పాల్పుడుతున్నారు. వీరి వల్ల మొత్తం సమాజంలో ఉపాధ్యాయుల, టీచర్లు అంటే చెడ్డపేరు వచ్చి పడుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరబాద్ లోని ఎర్రగడ్డ జనప్రియ అపార్ట్మెంట్లో నివసించే కాలువ శ్రీకాంత్ (30) అనే వ్యక్తి స్థానిక ప్రైవేట్ కళాశాలలో రెండేళ్లుగా లెక్కల అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. కళాశాల సమయం ముగిసిన తర్వాత, ఇంటర్ చదువుతున్న కొందరు విద్యార్థినులకు పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాడు.
ఈనేపథ్యంలో విద్యార్థినులను లైంగికంగా వేధిస్తు వారితో అసభ్యంగా చాటింగ్ చేసేవాడు. ముఖ్యంగా ఎన్డీఏ (NDA) వంటి పరీక్షల్లో శృంగారానికి సంబంధించిన ప్రశ్నలు వస్తాయని చెబుతూ, వారితో నీచంగా మాట్లాడేవాడు.
చనువు పెంచుకుని లైంగికంగా వేధింపులకు కూడా పాల్పడ్డాడు. దీంతో ఒక విద్యార్థిని ధైర్యం తెచ్చుకుని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఎస్సార్ నగర్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, అధ్యాపకుడు శ్రీకాంత్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనలో పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఈ ఘటన హైదరాబాద్ లో సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook