)
'నిన్న పశ్చిమబెంగాల్‌కు వెళ్లా. బెంగాల్‌లో తొలిసారి బీజేపీ సీఎం ప్రమాణస్వీకారం చేశారు. భారీ మెజార్టీతో బెంగాల్‌లో బీజేపీ గెలిచింది. బెంగాల్ విజయోత్సవం తెలంగాణలో కనిపిస్తోంది' అని ప్రధాని మోదీ తెలిపారు.
ప్రధాని మోదీ కామెంట్స్..
కాంగ్రెస్ ఎక్కడ ఉన్నా ఒకటే మోడల్. ఎన్నికల ముందు అలవీ కాని హామీలు ఇస్తారు. ఆ తర్వాత సాకులు వెతుకుతారు. తెలంగాణలో కూడా ఇదే జరుగుతోంది.
కాంగ్రెస్ విద్వేష రాజకీయాలను రెచ్చగొడుతోgది. తెలంగాణలో కాంగ్రెస్ గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారు.
PM Modi Speech Live Updates... బహిరంగ సభలో ప్రధాని మోదీ కామెంట్స్..
తెలంగాణకు వేల కోట్ల నిధులు ఇస్తున్నాం
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు
హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తోంది.
జహీరాబాద్‌లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తున్నాం
బెంగాల్‌లో విజయోత్సాహం తెలంగాణలో కనిపిస్తోంది
PM Modi Speech Live Updates.. బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
'21 రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచాం. రెండు ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకున్నాం. తెలంగాణ ఆగమవుతోంది.. అప్పుల పాలవుతోంది. రేవంత్ రెడ్డిలాగా అబద్ధాల గ్యారంటీలు ఇవ్వం. బీసీలు, విద్యార్థులు, దళితులకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది' బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Bandi Sanjay Speech.. తలదించుకునే పని అసలు చెయ్యం
'బీజేపీ సైనికులం...మోదీ శిష్యులం. ప్రాణం పోయినా తప్పు చేయం. తప్పు చేసే వాళ్లను కూడా వదిలిపెట్టబోం. బీజేపీ తలదించుకునే పని నేను అసలే చెయ్యం' అని సికింద్రాబాద్ బహిరంగ సభలో బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.
సింధు ఆస్పత్రి ప్రారంభం
మాదాపూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పార్థసారథి రెడ్డి నిర్మించిన సింధూ ఆస్పత్రి భవన సముదాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. హైదరాబాద్‌లో అతి పెద్ద ఆస్పత్రిలో సింధు ఆస్పత్రిగా గుర్తింపు పొందింది.
PM Modi Speech In Hyderabad Here Live Updates... ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం: ప్రధాని
తెలంగాణలో రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. 'సైబరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో పేరు ఉంది. సైబరాబాద్ అభివృద్ధి కేంద్రం వేలాది కోట్లు కేటాయించింది. దేశ అభివృద్ధిలో సైబరాబాద్ కీలక పాత్ర పోషిస్తోంది. మౌలిక వసతుల కల్పనకు మా ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా సైబరాబాద్‌ను తీర్చిదిద్దుతున్నాం. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది' అని ప్రధానమంత్రి తెలిపారు.
PM Narendra Modi Live Updates.. మీ సహకారం కావాలి: తెలంగాణ సీఎం
'ప్రధానిపై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సహకారం కావాలి. వికసిత్ భారత్‌లో తెలంగాణను నంబర్‌వన్ చేయడమే లక్ష్యం. రాజకీయాలు పక్కనబెట్టి అభివృద్ధి అందరం దృష్టి సారించాలి. వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలి' రేవంత్ రెడ్డి
హెచ్‌ఐసీసీలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు. కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన రేవంత్ రెడ్డి. ఈ పర్యటనలో పోక్సో కేసు నమోదైన బండి భగీరథ తండ్రి బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో పాల్గొనడం గమనార్హం.
PM Narendra Modi Live Updates.. రూ.9 వేల కోట్ల పనులు
హైటెక్‌సిటీలోని హెచ్‌ఐసీసీలో ప్రధానమంత్రి రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. బేగంపేట నుంచి హెచ్‌ఐసీసీకి ప్రధానమంత్రి బయల్దేరారు. అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రితో కలిసి అభివృద్ధి పనుల కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం వ్యక్తిగత పర్యటన చేయనున్నారు.
లక్ష మందితో సభ
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రధాని మోదీ సభకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయగా.. సుమారు లక్ష మంది హాజరవుతారని సమాచారం. జాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా రియల్ టైమ్ మానిటరింగ్.. ప్రవేశ ద్వారాల వద్ద అధునాతన స్కానర్లు ఏర్పాటు చేయడంతో పకడ్బందీ బందోబస్తు ఏర్పాటుచేశారు. హెల్మెట్లు, లైటర్లు, మ్యాచ్ బాక్స్‌లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లకు అనుమతి నిరాకరించారు.
PM Narendra Modi Telangana Visit Live Updates... హైదరాబాద్ చేరుకున్న మోదీ
హైదరాబాద్ చేరుకున్న ప్రధానమంత్రి. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రధాని హెచ్‌ఐసీసీకి వెళ్లనున్నారు.
PM Modi Hyderabad Tour Live Updates.. ప్రధాని పర్యటనపై పోక్సో కేసు ప్రభావం
ప్రధానమంత్రి పర్యటనపై బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసు ప్రభావం చూపుతోంది. ప్రధాని పర్యటనకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయగా.. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ బాలికపై అత్యాచారం చేయడంతో అతడిపై పోక్సో నమోదైంది. దీంతో బీజేపీ శ్రేణులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అధికారికంగా బండి సంజయ్ కొడుకు కేసుపై నోరు మెదపకపోగా.. ఈ కేసు అంశం మాత్రం ప్రధాని పర్యటనలో చర్చనీయాంశంగా మారింది. ఆ కేసుపై ఎలా స్పందించాలో.. ఎలా ఆత్మరక్షణ పడాలో తెలియక తెలంగాణ బీజేపీ నాయకత్వం తికమకపడుతోంది. ప్రధాని పర్యటన వేళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బండి సంజయ్ ఉండకపోతుండడంతో బీజేపీ శ్రేణులు నిరాశ చెందుతున్నారు.
PM Narendra Modi Tour Live Updates... 3 వేల మందితో బందోబస్తు
ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. 3 వేల మందితో ప్రధాని కార్యక్రమాలకు బందోబస్తు ఉంచారు. ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాకపోకలు సాగించే మార్గాల్లో ముందే ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే ఆదివారం కావడంతో ప్రధాని పర్యటన హైదరాబాద్ ప్రజలపై అంతగా ప్రభావం చూపే అవకాశం లేదు. సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ మాదాపూర్, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో ప్రధాని పర్యటిస్తున్నారు.
PM Narendra Modi Telangana Visit Live Updates.. మోదీ వెంట రేవంత్ రెడ్డి
ప్రధానమంత్రి పర్యటనలో భాగం కానున్న తెలంగాణ ముఖ్యమంత్రి. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలకడం.. అనంతరం హైటెక్‌సిటీలో జరిగే ఆస్పత్రి ప్రారంభోత్సవం, అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో నరేంద్ర మోదీతోపాటు రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు.
ప్రధాని పర్యటపై పవన్ కల్యాణ్ స్పందన
Telangana welcomes Hon’ble Prime Minister Sri @narendramodi Ji on his visit for the foundation laying of development projects worth ₹9,400 crore.
My heartfelt gratitude to the NDA Central Government for its commitment towards strengthening infrastructure, connectivity, and… pic.twitter.com/XKu79TUU0h
— Pawan Kalyan (@PawanKalyan) May 10, 2026
PM Narendra Modi Live Updates.. ప్రధాని పర్యటనపై ఏపీ సీఎం స్పందన
తన నివాసానికి ప్రధానమంత్రి వస్తుండడంపై ఏపీ సీఎం చంద్రబాబు 'ఎక్స్' వేదికగా స్పందించారు. తన నివాసానికి వస్తోన్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆత్మీయ స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు. ప్రధాని తమ నివాసానికి రావడాన్ని గౌరవంగా భావిస్తున్నామని.. తనకు.. తమ కుటుంబానికి ఇదో మరిచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుందని ఎక్స్‌లో పోస్టు చేశారు.
PM Modi Hyderabad Tour Live Updates: ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధానికి భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. అయితే బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై నమోదైన పోక్సో కేసుతో ప్రధాని పర్యటన రాజకీయంగాను తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో ప్రధాని పర్యటన చాలా కార్యక్రమాలతో బిజీబిజీగా ఉండనున్నారు. దాదాపు ఆరున్నర గంటలు హైదరాబాద్‌లో ఉండనున్న ప్రధాని చాలా కార్యక్రమాలకు హాజరుకానున్నారు. బేగంపేటలో విమానం దిగిన అనంతరం మాదాపూర్, హైటెక్‌సిటీలో పర్యటించనున్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో కీలక ప్రసంగం చేయనున్నారు. హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన నిమిష నిమిషానికి లైవ్ అప్‌డేట్స్.