Messi Tour Hyderabad Traffic Advisory: ఈరోజు ప్రముఖ అర్జెంటీనా ఫుట్‌బాలర్ మెస్సీ హైదరాబాద్ టూర్ నేపథ్యంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉప్పల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం డిసెంబర్ 13వ తేదీ పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఎక్స్ వేధికగా ప్రకటించారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
ఘట్ కేసర్ నుంచి ఉప్పల్ వైపుగా వచ్చే హెవీ వెహికల్స్ హెచ్ఎండిఏ, ఉప్పల్ భగాయత్ ఎంట్రన్స్ లోని మెఫీల్ హోటల్ నుంచి నాగోల్ వైపుగా మళ్లింపులు చేపట్టారు. ఇక ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ కి వచ్చే వాహనాలను నాగోల్ మెట్రో స్టేషన్ యూటర్న్ గుండా హెచ్ఎండిఏ భగాయత్ టయోటా యూటర్న్ బోడుప్పల్- చెంగిచెర్ల -ఐఓసీఎల్- చర్లపల్లి-ఘట్కేసర్ వైపుగా మళ్లింపులు చేపట్టారు.
ఇక తార్నాక నుంచి ఉప్పల్ మీదుగా వచ్చే వాహనాలను హబ్సిగూడ క్రాస్ రోడ్ నుంచి నాచారం NFC రోటరీ- ఐఓసీఎల్ -చర్లపల్లి -ఘట్ కేసర్ వైపుగా మళ్లింపులు చేపట్టారు. ఇక రామంతపూర్ నుంచి ఉప్పల్ వెళ్లే వాహనాలను స్ట్రీట్ నెంబర్ 8 నుంచి హబ్సిగూడ క్రాస్ రోడ్ -నాచారం -NFC రోటరీ- ఐఓసీఎల్- చర్లపల్లి- ఘట్ కేసర్ వైపుగా వెళ్లాలి.
ఇక వరంగల్ నుంచి వచ్చే హెవీ వెహికల్స్ హైదరాబాద్ వచ్చే హెవీ వెహికల్స్ వయా ఉప్పల్ ఓఆర్ఆర్ వద్ద ఘట్ కేసర్- అబ్దుల్లాపూర్మెట్- ఎల్బీనగర్- దిల్‌షుక్ నగర్ మీదుగా వెళ్లాలని సూచించారు. అలాగే హైదరాబాద్ నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ వెళ్లాల్సిన వాహనాలు ఎల్బీనగర్- హయత్ నగర్ -అబ్దుల్లాపూర్మెట్- ఓఆర్ఆర్ మీదుగా వరంగల్ వెళ్లాల్సిందిగా ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ఇక మెస్సీ మ్యాచ్ సందర్భంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11:50 గంటల వరకు ఫలక్‌నూమా నుంచి ఉప్పల్ -సంతోష్ నగర్ .సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వయా హబ్సిగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా ఉండే అవకాశం ఉంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
🚦 TRAFFIC ADVISORY – MESSI TOUR, UPPAL 🚦
In view of the MESSI Tour & Live Event at Rajiv Gandhi International Cricket Stadium, Uppal on 13.12.2025, moderate traffic congestion is expected. Traffic diversions will be in effect within the limits of Uppal Traffic PS.
🔸 Heavy… pic.twitter.com/kbXh3baPBV
— Rachakonda Police (@RachakondaCop) December 12, 2025
స్టేడియం దరిదాపుల్లోకి రావద్దు..
మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అయితే టికెట్ లేని వారు స్టేడియం దరిదాపుల్లోకి కూడా రాకూడదని మీడియా సమావేశంలో సీపీ తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో మొత్తంగా 39,000 మందికి సిట్టింగ్ సామర్థ్యం ఉంది. లోపల బయట సీసీ కెమెరాలు 400 పైగా ఏర్పాటు చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా షీ టీం, డ్రోన్ కెమెరాలు కూడా పర్యవేక్షిస్తున్నాయి. అంతేకాదు మెస్సీకి జెట్ క్యాటగరీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఆయన స్టేడియానికి వచ్చి పోయే మార్గాల్లో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే మెస్సీని చూడడానికి పెద్ద ఎత్తున రోడ్లపైకి రాకూడదని.. టికెట్ లేని వారు స్టేడియం దరిదాపుల్లో కూడా రావద్దని ఆయన సూచించారు. మ్యాచ్ కి కేవలం నాలుగు గంటల ముందే ఈ టికెట్ జారీ చేసే యాప్ ఓపెన్ చేస్తున్నారు. అయితే సాయంత్రం 4 గంటల లోపే స్టేడియంలోకి చేరుకోవాలని కూడా సూచించారు.
ఇదీ చదవండి: కొత్త ఇ-పాస్‌పోర్ట్ వచ్చేసింది.. డౌన్‌లోడ్ చేసుకోవచ్చా? అప్లై మీ నగరంలో అందుబాటులో ఉందా?
ఇదీ చదవండి: వృద్ధాప్యంలో భార్యాభర్తలు రూ.10 వేల పెన్షన్ పొందాలంటే ఈ చిన్న పని చేయండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









