)
Pm modi slams on cm revanth reddy govt ahead of Hyderabad visit: హైదరాబాద్ లో ప్రధాని మోదీ రాకతో ఎక్కడ కూడ అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ కు ప్రధాని రానుండటంతో బీజేపీ శ్రేణులు కూడా ఈ పర్యటనను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ గత బీఆర్ఎస్ ప్రస్తుతం కాంగ్రెస్ లపై విమర్శలు చేస్తు సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారనిఅన్నారు. ప్రజలంతా చూపంతా ప్రస్తుతం బీజేపీ వైపు ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ పార్టీ పాగ వేయడం ఖాయమన్నారు.
అయితే.. ప్రధానిమోదీ రేపు, మే 10న కర్ణాటక తెలంగాణలో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటానని వెల్లడించారు. అదే విధంగా.. ఉదయం 11 గంటలకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపనకు 45 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. సమాజ సేవ అనే మా విలువలకు అనుగుణంగా, ఈ సంస్థ అనేక రంగాల్లో ప్రశంసనీయమైన సేవలు అందిస్తోందన్నారు.
మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకుని సుమారు రూ. 9500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను శంకుస్థాపనలు చేసి వాటిని ప్రారంభిస్తానని చెప్పారు. ప్రాజెక్టులు రహదారులు, లాజిస్టిక్స్, టెక్స్టైల్స్, రైల్వేలు, ఎనర్జీ తదితర రంగాలను కవర్ చేస్తాయన్నారు. అనంతరం సింధు హాస్పిటల్‌ను దేశానికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటానన్న ప్రధాని మోదీ పలు వివరాలు వెల్లడించారు.
సాయంత్రం నగరంలో జరిగే బీజేపీ సభలో ప్రసంగిస్తానని అన్నారు. గతంలో బీఆర్ఎస్ పాలనతో, ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఆశతో చూస్తున్నారన్నారు. తమ పార్టీకి పెరుగుతున్న మద్దతు చూసి ఇతర పార్టీలు కుమ్మక్కుఅయి రాజకీయాలు చేస్తున్నాయన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook