)
Prabhutva Sarai Dukanam Controversy:జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది రచనా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’. ఈ చిత్రాన్ని ఎస్వీఎస్ ప్రొడక్షన్స్, శ్రీనిధి సినిమాస్ బ్యానర్ పై దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలో ప్రేక్షక దేవుళ్ల ముందుకు రారన్న ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ లోని డైలాగులు, సీన్స్ వివాదాస్పదం అయ్యాయి. ఈ సినిమాలోని డైలాగుల్లో ప్రభుత్వ యాసను దుర్వినియోగం చేసారని.. ఆడవారిని అవమానించేలా ఈ సినిమాలోని డైలాగులున్నాయని కొంత మంది మహిళ నేతలు స్పందించారు. అంతేకాదు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ కి మహిళా సమైక్య ప్రతినిధులు కంప్లైంట్ చేసారు.
ఈ సందర్భంగా మహిళా సమైక్య ప్రతినిధి దీపా దేవి మాట్లాడుతూ... "ప్రభుత్వ సారాయి దుకాణం అనే చిత్ర టీజర్ లో మహిళలను కించపరుస్తూ పలు డైలాగులు ప్రస్తుత మహిళలను సభ్య సమాజంలో మరింత పలుచన చేసేలా ఉన్నాయన్నారు. తెలంగాణలోని మహిళలు ఎంత నీచంగా మాట్లాడుతారా? అంతేకాక ఆడవారితో కూడా అటువంటి బూతులతో కూడిన డైలాగులు చెప్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమాతో డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అర్ధం కావడం లేదన్నారు. మొత్తం మహిళలను చిన్న చూపు చూసేలా ప్రస్తుతం సమాజ భవిష్యత్తును ఎటు తీసుకువెళ్దాం అనుకుంటున్నారని దర్శకుడి తీరును దుయ్యబట్టారు. ముఖ్యంగా ఈ చిత్రంలో తెలంగాణ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఈ చిత్రం విడుదలయితే మేము ఊరుకోము, ఖబర్దార్ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చాడు. డైరెక్టర్ నేషనల్ అవార్డ్ విన్నర్ నుంచి ఇటువంటి చిత్రాలు తీయడం అనేది చాలా తప్పు. మహిళలు మీకు అలా కనిపిస్తున్నారా? రాజకీయాలలోని మహిళల గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ సినిమాను విడుదల కానివ్వము అంటూ దర్శక, నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే సెన్సార్ బోర్డును ముట్టడిస్తామన్నారు. ఈ సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వొద్దని.. విడుదలను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
మరొక మహిళ సమైక్య ప్రతినిధి నీరజ మాట్లాడుతూ... "రోజురోజుకు సినిమాలు తీసే విధానం పూర్తిగా మారిపోయింది. సినిమాలంటేనే లేడీస్ ను విలాస వస్తువుగా చూపిస్తున్నారు. మహిళలను దిగజార్చేలా రోజు రోజుకు మరింతగా మేకర్స్ దిగజారిపోతున్న విషయాన్ని ప్రస్తావించారు. కేవలం లాభార్జన ధ్యేయంగా ఎలా పడితే అలా సినిమాలను తీస్తున్నారన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సారాయి దుకాణం అనే టైటిల్ తో వస్తున్న చిత్రంలో తెలంగాణ యాసను అవమానిస్తున్నారు. ప్రపంచమంతా మన తెలంగాణ అభివృద్ధిని చూస్తుంటే ఇటువంటి నిజమైన భాషతో ఆడవారిపై జుగుప్స కలిగేలా దూషిస్తూ ఇటువంటి సినిమాలు తీయడం మంచిది కాదన్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు ఇటువంటి చిత్రాలు చేయడం అనేది సరైనది కాదన్నారు. మీ ఇంట్లో ఆడవారు ఇటువంటి బూతులతో కూడిన భాషను ఉపయోగిస్తే మీరు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఈ సినిమాను నిలిపివేయకపోతే దర్శకుడు ఇంటిని ముట్టడిస్తామన్నారు.
ధనమ్మమాట్లాడుతూ... "ఎంతో గౌరవంగా ఎన్నో పండుగలు వ్యవహరించే తెలంగాణ మహిళలను కించపరుస్తూ ఇటువంటి సినిమాలు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ సారాయి దుకాణం సినిమాలో ఎన్నో బూతులున్నాయి. ఈ చిత్ర విడుదలను వెంటనే నిలిపివేయాలని కోరుతున్నాము. లేదంటే చాంబర్ ను, సెన్సార్ బోర్డును ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.