Renu Desai: మీకసలు బుద్దుందా..?.. వీధి శునకాల ఘటనపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..

Renu desai emotional comment on stray dog deaths: వీధి శునకాలను ఇష్టమోచ్చినట్లు చంపేస్తున్నారని నటి రేణు దేశాయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క శునకం తేడాగా ప్రవర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్ని శునకాలను చంపేయడం ఏంటని రేణు దేశాయ్ ఫైర్ అయ్యారు.   

Written by - Inamdar Paresh | Last Updated : Jan 19, 2026, 03:17 PM IST
  • వీధి కుక్కలను చంపడం ఏంటని రేణు దేశాయ్ పైర్..
  • ఆల్కాహల్, ఇతర మరణాల సంగతేంటని ప్రశ్నలు..
Renu Desai: మీకసలు బుద్దుందా..?.. వీధి శునకాల ఘటనపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..

Renu desai fires on supreme court verdict over stary dog incident: వీధి శునకాల ఘటనపై దేశ వ్యాప్తంగా రచ్చనడుస్తొంది. ప్రతిరోజు కూడా కుక్కకాటు ఘటనలు వెలుగులోకి వస్తునే ఉన్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు సైతంవీధి శునకాలు కాటు వేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వాలే పరిహారంను చెల్లించాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. కుక్కలపై అంత ప్రేమ ఉంటే వాటిని తమ ఇళ్లకు తీసుకెళ్లలని కూడా చెప్పింది. శునకాల కంటే మనుషుల ప్రాణాలే విలువైదని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో టాలీవుడ్ నటి రేణు దేశాయ్ వీధి శునకాల వరుస ఘటనపై సోమాజి గూడ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Add Zee News as a Preferred Source

 

ఒక కుక్కకు ఏమైన జరిగితే కొరికితే వెంటనే దగ్గరలోని అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కానీ వందల సంఖ్యలో నోరులేని కుక్కల్ని చంపడం ఏంటని ఎమోషనల్ అయ్యారు. కుక్కలన్ని కూడా ప్రమాదకరం కాదన్నారు. తాను రోజు వందల సంఖ్యలో కుక్కలకు సేవలు చేస్తుంటానని, తన ఇంట్లో చాలా కుక్కలు ఉన్నాయని ఏ రోజు కుక్క కాటుకు గురికాలేనని అన్నారు.

ప్రతి ఏటా లక్షల మంది దోమకాటును చనిపోతున్నారని, పర్యావరణం పరిశుభ్రత, హెల్మెట్ లేని వారు చనిపోతున్నారని అన్నారు. ఇక మహిళలపై, అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యలు మొదలైనవి జరుగుతున్నాయని వీటినిఎవరు ప్రశ్నించడంలేదని, ఒక్క నోరులేనీ జీవాలు మాత్రమే మీకు కన్పిస్తున్నాయా అంటూ రేణు దేశాయ్ సీరియస్ అయ్యారు. కుక్కల్ని చంపి మీకు అసలు  నిద్ర ఎలా పడుతుందని భావోద్వేగంకు గురయ్యారు. మీ ఇంట్లో తల్లి లేదా, చెల్లెళ్లు లేదా అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు.

Read more: Pooja Hedge: ఆ హీరో నన్ను బలవంతం చేస్తే చెంప మీద కొట్టా.!. షాకింగ్ నిజం రివీల్ చేసిన  పూజా హెగ్డే..

ఎక్కడ చూసిన లిక్కర్ షాపులు ఉన్నాయన్నారు. లిక్కర్ తాగి న్యూసెన్స్ లు చేస్తున్నారని ఇది మాత్రం కన్పించడంలేదా అంటూ మండిపడ్డారు. ఇది కలియుగం అని ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందన్నారు. కుక్క కేవలం పదేళ్లు మాత్రమే బతుకుందని, దానిపైన ఎంటని అన్నారు. ఆ సుప్రీంకోర్టు జడ్జీలకు కూడా శునకాల మీద ఏదో కోపం ఉంది కాబట్టే ఈ విధంగా మాట్లాడారన్నారు. కుక్క కరిస్తే ప్రాణం పోతేనే దానికి విలువ ఉన్నట్టా.. ఎందుకిలా మీ కోపం శునకాలపై చూపిస్తున్నారని రేణు దేశాయ్ శివాలెత్తిపోయిరు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News