)
Romance On Wheels: ఆకతాయిలు.. అమ్మాయిలు రెచ్చిపోతున్నారు. ఎవరు ఏమనుకుంటే ఏమని భావించి బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడితనంతో ప్రవర్తిస్తున్నారు. సమాజం ఏమనుకుంటుందనే సోయి మరచి నడిరోడ్డుపై సరసాలు ఆడుతున్నారు. చుంగనం.. కౌగిలింతలు.. ఇక శృంగారం కూడా కానిస్తున్నారు. ఇలాంటి ఇతర రాష్ట్రాలు.. ఇతర ప్రాంతాల్లో చూశాం. కానీ ఇప్పుడు ఆ జాఢ్యం హైదరాబాద్‌కు కూడా పాకింది. నడిరోడ్డుపై ఆటో స్టీరింగ్‌పై అమ్మాయిని కూర్చోబెట్టుకుని ఓ యువకుడు రొమాన్స్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లోని నల్గొండ క్రాస్ రోడ్డు నుంచి కోఠి వరకు ఓ ఆటో వెళ్తోంది. చాదర్‌ఘాట్ బ్రిడ్జిపై వెళ్తుండగా ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారులు ఆటో వైపు చూడగా అందులో ఓ యువతి, ఆటో డ్రైవర్ రొమాన్స్ చేసుకుంటూ కనిపించారు. యువతిని ఆటో స్టీరింగ్‌పై కూర్చోబెట్టుకుని తనతో యువకుడు రొమాన్స్ చేస్తూ ఆటో నడుపుతున్నాడు. అటు వైపుగా వెళ్తున్న వారంతా ఔరా? అంటూ విస్తుపోయారు. ఇదేమీ బరితెగింపు అనుకుంటూ వారిని ఏమనుకుండా ముందుకు వెళ్లారు. ఆ ఆటోను కొందరు వీడియోలు, ఫొటోలు తీశారు.
నిత్యం ట్రాఫిక్‌తో బిజీగా ఉండే చాదర్‌ఘాట్ బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఆ సమయంలో వారిని ట్రాఫిక్ పోలీసులు ఆపలేదా? లేకుంటే విధుల్లో నిర్లక్ష్యం వహించారా? అనేది తెలియదు. ఇలా ప్రమాదకరంగా ఆటో నడపడమే కాకుండా బహిరంగంగా అమ్మాయితో స్టీరియపై అలా కూర్చుబెట్టుకోవడాన్ని అందరూ తప్పుబడుతున్నారు. ఇలా చేస్తూ ఆటో నడిపితే ప్రమాదాలు చోటుచేసుకోవా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు.
కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. నగర పరిసర ప్రాంతాల్లో బైక్‌లు, కార్లలో ఇలాంటి సాహసాలు చేస్తూ ప్రమాదాలను కోరి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నగర పౌరులు కోరుతున్నారు. బైక్‌లతో విన్యాసాలు.. కార్లలో అశ్లీల పనులు చేయడాన్ని అందరూ తప్పుబడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి