)
TSRTC MD: 'ఈ నాలుగేళ్లు అనేక ఒడిదొడుకులతో మన ప్రయాణం సాగినప్పటికీ.. మీ అందరి సంపూర్ణ మద్దతుతో సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చగలిగాం' అని సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల సహకారంతో ఆర్టీసీ తిరిగి తన కాళ్లపై తాను నిలబడేలా కృషి చేశామని గుర్తుచేశారు. సంస్థ ప్రకటించిన ప్రతి ఛాలెంజ్‌ను విజయవంతం చేశామని ప్రకటించారు. ఈ సందర్భంగా తన చివరి రోజుపై ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీగా వీసీ సజ్జనార్ సోమవారం చివరి రోజు పని చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపడుతున్న సజ్జనార్ ఆర్టీసీ నుంచి బంధాన్ని తెంచుకున్నారు. నాలుగేళ్లుగా ఆర్టీసీ ఎండీగా విశేష సేవలు చేసిన సజ్జనార్ వాటిని ఉద్యోగులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన నాలుగేళ్ల ప్రయాణాన్ని సజ్జనార్ గుర్తుచేసుకుంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీకి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వైదొలుగుతున్న వరకు జరిగిన పరిణామాలను సజ్జనార్ ఆ ప్రకటనలో వివరించారు. అందరి సహాయ సహకారాల వల్ల నాలుగేళ్లకు పైగా ఈ పోస్టింగ్‌లో కొనసాగినట్లు ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు. తాను బాధ్యతలు స్వీకరించే నాటికి సంస్థ చాలా కష్టకాలంలో ఉందని.. ఆర్థిక లోటుతో సతమతమవుతున్న సంస్థను ఇప్పుడు సొంత కాళ్లపై నిలబడే స్థాయికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
అందరి అభిప్రాయాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని.. ఉన్నతాధికారులు, ఆర్థిక నిపుణులతో చర్చించి తెలంగాణ ఆర్టీసీని గట్టెక్కించినట్లు సజ్జనార్ తెలిపారు. ప్రతి ఉద్యోగిని సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యం చేశామని.. వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్లినట్లు వెల్లడించారు. కృషితో నాస్తి దుర్బిక్షం అన్న నానుడిని అందరం కలిసి నిరూపించామని ప్రకటించారు. అందరి సహకారంతో అనేక కీలక సంస్కరణలను అమలు చేశామని వివరించారు.
ఏడాదికి రూ.9000 కోట్లకు పైగా రాబడి సాధించడం, కార్పొరేట్‌కు దీటుగా తార్నాక ఆస్పత్రిని తీర్చిదిద్దడం, ఉద్యోగులను సాధికారత చేయడం వంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టినట్లు వీసీ సజ్జనార్ గుర్తుచేశారు. అందరి కృషి, పట్టుదలతో పాటు నిబద్దత, అంకితభావంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని గర్వంగా ప్రకటించారు. నాలుగేళ్ల కాలంలో ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటూనే.. ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేసినట్లు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook