)
Hyderabad Airport Closed: శంషాబాద్ ఎర్‌పోర్టులో విమానాల ల్యాండింగ్‌కు వాతావరణం అనుమతించకపోవడంతో..పలు విమానాలను దారి మళ్లించారు అధికారులు. పలు విమానాలను గన్నవరం ఎయిర్‌పోర్టుకు దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. దీంతో కోల్కత్త-హైదరాబాద్, బాంబే- హైదరాబాద్, పూణే-హైదరాబాద్ విమానాలను గన్నవరం ఎయిర్ పోర్టుకు దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు లబో దిబో మంటున్నారు. అత్యవసర పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు వాతావరణం సహకరించకపోవడంతో విమానాలను దారి మళ్లించారు. ఇక శంషాబాద్ విమానాశ్రయంలో దట్టంగా మేఘాలు అల్లుకున్నాయి. దీంతో కింద ఎక్కడా దిగాలో తెలియకపోవడంతో విమానాల దారి మళ్లింపు చేపట్టినట్టు తెలిపారు.
హైదరాబాద్‌లో రాత్రి నుంచి ఎకదాటిగా వర్షం పడుతోంది. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో రన్‌వేపై వర్ష నీరు చేరింది. దీంతో పలు విమానాలను గన్నవరం ఎయిర్‌పోర్టుకు దారి మళ్లించారు.ప్రస్తుతం శంషాబాద్ విమానాశ్రయంలో యుద్ధ ప్రాతిపదికన నీటిని తోటి పోస్తున్నారు. ఇది ఈ రోజు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు ప్రయాణికులు... శంషాబాద్ కు ప్రత్యామ్నాయం గా బేగంపేట కానీ.. హకీంపేట ఎయిర్ ఫోర్స్ కు దారి మళ్లిస్తే బాగుంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది సెక్యూరిటికి సంబంధించిన కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఏదైనా ఇబ్బందులు తలెత్తినపుడు.. బేగంపేట కానీ.. హకీంపేట ఎయిర్ పోర్ట్ లో లాండ్ చేస్తే ప్రయాణికులు కూడా సులభంగా అక్కడ నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. హకీంపేట కూడా ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరో ఉంది కాబట్టి హైదరాబాద్ లో పనిపై వచ్చిన వారికి పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. బేగంపేటలో లాండ్ చేస్తే.. సరిగ్గా హైదరాబాద్ నడిబొడ్డున దిగినట్టు అవుతుంది. ఏ రకంగా చూసిన శంషాబాద్ వంటి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఇబ్బందులు తలెత్తితే.. ఈ ఎయిర్ పోర్ట్ లను ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తే బాగుంటుంది. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలోని గన్నవరంలో లాండ్ చేస్తే ప్రయాణికులు తిప్పలు తప్పించి మరేమి ఉండదని నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.