)
Hyderabad Juice Incident: నేను పవిత్ర ఖురాన్‌ను పూర్తి చేశాను. ఈ సందర్భంగా అందరికీ జ్యూస్ ఇస్తున్నా. అంకుల్ మీరు తీసుకోండి.. అన్న మీరు తీసుకోండి.. అంటూ ఓ యువకుడు దుకాణాలు, అపార్టుమెంట్లు చుట్టు తిరిగాడు. కొంతమంది మంచి పనే కదా అనుకుంటూ మరేమి అడగకుండా తాగేశారు. కొందరు వద్దులే బాబు అంటూ సున్నితంగా తిరస్కరించారు. వద్దులే అనుకున్న వాళ్లు సేఫ్ అవ్వగా.. తాగిన వాళ్లకు మాత్రం ఊహించని విధంగా విచిత్రం జరిగింది. 12 మంది దాదాపు 15 గంటలపాటు గాఢ నిద్రలో ఉండిపోయారు. నిద్రలేచిన తరువాత తమకు ఏం జరిగిందో అయోమయంలో ఉండిపోయారు. హైదరాబాద్ డబీర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమకు ఏం జరిగిందో అర్థం కావడం లేదని.. అంతా అయోమయంగా ఉందని చెబుతున్నారు. యువకుడు ఎవరనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. యువకుడు ఎక్కడి నుంచి వచ్చాడు..? అతని ఉద్దేశం ఏమిటి..? అని తెలుసుకుంటున్నారు. జ్యూస్‌లో ఏమైనా మత్తు పదార్థాలు కలిపాడా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు.
యువకుడు తిరిగిన దుకాణాలు, అపార్ట్మెంట్ల వద్ద పోలీసులు వివరాలు తెలుసుకుంటున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి.. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు ఇలా అనుహ్యంగా వచ్చి జ్యూస్ ఇవ్వడం.. అందరూ గాఢ నిద్రలోకి జారుకోవడం.. స్థానికుల్లో కలకలం రేపింది. ప్రస్తుతం బాధితుల ఆరోగ్యంగానే ఉన్నా.. పూర్తిస్థాయిలో ఇంకా కుదుటపడలేదని స్థానికులు చెబుతున్నారు. జ్యూస్‌కు సంబంధించిన నివేదికలు వస్తే.. మత్తు పదార్థాలు ఏమైనా కలిపారా అనే విషయంపై క్లారిటీ రానుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే పానీయాలు, మత్తు పదార్థాలు తీసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా అనుమాస్పదంగా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook