Other Caste Marriage: ఒకే గ్రామానికి చెందిన యువతీ యువకులు ప్రేమించుకున్నారు. వారిద్దరి కులాలు వేరు కావడంతో కుటుంబసభ్యులు అంగీకరించరని భావించి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి ఒకరి సహాయం పొందారు. వారిద్దరి వివాహానికి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సహకరించాడు. దీంతో అతడిపై పెళ్లి కుమారుడి కుటుంబసభ్యులు ఆగ్రహం పెంచుకున్నారు. కులాంతర వివాహం ఎలా చేయిస్తావని ఆగ్రహంతో సహకరించిన వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు. ఈ సంఘటన తెలంగాణలో తీవ్ర సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Safe Investment: ఈ పథకంలో పెట్టుబడి పెడితే చాలు.. డబుల్ ప్రాఫిట్
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి రాజశేఖర్ తమ్ముడు చంద్రశేఖర్ అదే గ్రామానికి చెందిన భవాని అనే యువతిని ప్రేమించాడు. వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించరని భావించారు. దీంతో 10 రోజుల కిందట వారు గ్రామం నుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. అయితే వారి పెళ్లికి రాజశేఖర్ సహకరించాడని వధువు బంధువులు కక్ష పెంచుకున్నారు.
Also Read: Mahesh Babu: రాజమౌళి 'వారణాసి'తో మా నాన్న కృష్ణ కోరిక నెరవేరింది: హీరో మహేశ్ బాబు
కులాంతర వివాహానికి సహకరించారని రాజశేఖర్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వధువు కుటుంబీకులు ఈ నెల 12వ తేదీన మాట్లాడుకుందామని అతడిని పిలిపించుకున్నారు. రాజీ కుదుర్చుకుందామని నలుగురు వ్యక్తులు రాజశేఖర్‌ను నమ్మించి గ్రామ శివారుకు తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత తీవ్రంగా కొట్టారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత రాజశేఖర్ మృతదేహాన్ని కారులో మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎన్మనగండ్ల గేటు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ రాజశేఖర్ మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు.
Also Read: Mahesh Babu Movie Name: మహేష్ బాబు-రాజమౌళి మూవీ టైటిల్ ఇదే.. రిలీజ్ ఎప్పుడంటే..?
రాజశేఖర్ కనిపించడంలేదని కుటుంబసభ్యులు షాద్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తండ్రితోపాటు అనుమానం ఉన్న పలువురి పేర్లను పోలీసులకు ఇచ్చారు. షాద్‌నగర్ పోలీసులు విచారణ చేపడుతున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









