)
Indiramma Sarees: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మరికొన్ని కానుకలు ప్రకటించింది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రవేశపెట్టగా తాజాగా ఇందిరమ్మ పేరిట చీరలు పంపిణీ చేసింది. వీటితోపాటు మహిళకు పెట్రోల్ బంక్‌లు, సోలార్ ప్లాంట్లు, బస్సుల యజమానులుగా చేస్తామని హామీ ఇచ్చింది. మహిళా ఉత్పత్తుల మార్కెటింగ్‌కు అమెజాన్‌తో ఒప్పందానికి సంప్రదింపులు చేస్తున్నామని తెలిపింది. మహిళల ఉన్నతి-తెలంగాణ ప్రగతి పేరిట ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి బుధవారం నివాళులర్పించిన అనంతరం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీని ప్రారంభించారు. అనంతరం సచివాలయంలో మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌సీ) సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు. మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వివిధ వస్తువులను ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు అమెజాన్‌తో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణలోని అర్హులైన కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు.చీరల పంపిణీ ప్రక్రియకు ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్లకు చెప్పారు. డిసెంబరు 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లోని 18 ఏళ్లు నిండిన మహిళలకు చీరల పంపిణీ పూర్తి చేయాలని.. ఇందుకు రూ.65 లక్షలు అందుబాటులో ఉంచామని ప్రభుత్వం వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు 35 లక్షలు చీరలు పంపిణీ చేయాలని తెలిపారు. అర్హులైన ప్రతి మహిళకు చీర అందుతుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మహిళల ఉన్నతే లక్ష్యంగా వడ్డీలేని రుణాలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతోపాటు ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. యూనిఫాంలు కుట్టే బాధ్యతను అప్పజెప్పడంతో మహిళా సంఘాలకు రూ.30 కోట్ల ఆదాయం సమకూరిందని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో రూ.534 కోట్ల పనులు చేపట్టామని ప్రభుత్వం వెల్లడించింది. ధాన్యం కొనుగోళ్లు మహిళా సంఘాలకే అప్పజెప్పామని.. శిల్పారామం పక్కన ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటుచేశామని వివరించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి