)
Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో వరుసగా భారీ వర్షాలకు తోడు భారీ వరదలతో రాజధాని జలదిగ్బంధంలో చిక్కుకుంటోంది. అనూహ్యంగా అర్థరాత్రి భారీ వరద పోటెత్తడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జంట జలాశయాల గేట్లు ఎత్తడం, మూసీకి వరద నీటి ప్రవాహం పెరగడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో భయానక పరిస్థితి ఏర్పడడంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. పరిస్థితిని సమీక్షించింది. అక్కడ ఉన్న పరిస్థితిని ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మూసీ వెంట లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అర్ధరాత్రి ఎంజీబీఎస్ బస్టాండ్ చుట్టూ నీళ్లు రావడంతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యలను సమీక్షించారు.
ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చే ఏర్పాట్లు అధికారులు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్‌కు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ రూట్లకు మళ్లించాలని అధికారులకు చెప్పారు. బతుకమ్మ, దసరా పండుగల వేళ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ విభాగం చర్యలు చేపట్టాలని ఆర్టీసీ యంత్రాంగానికి సూచించారు.
వరుసగా రెండో రోజు కూడా హైదరాబాద్‌లో భారీ వర్ష సూచన ఉండడంతో పోలీస్, ట్రాఫిక్ హైడ్రా, జీహెచ్ఎంసీ, విద్యుత్తు విభాగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. అన్ని విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. నగరంలో నీళ్లు నిలిచే ప్రాంతాలు, మూసీ ప్రమాదకరంగా ప్రవహించే ప్రాంతాల్లో అధికారులు ప్రజలను హెచ్చరించేలా బోర్డులు పెట్టాలని, అటు వైపు వాహనాలు, ప్రజలు వెళ్లకుండా దారి మళ్లించాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook