)
Telangana Rising 2047: తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. 2034 నాటికి ఒక ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ డాక్యుమెంట్లో కనిపించాలి తెలంగాణ ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలని సూచించింది.
తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్‌పై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా పాలసీ డాక్యుమెంట్‌పై అధికార యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని స్పష్టం చేశారు. 'రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలి. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి (క్యూర్), పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్)గా మూడు రీజియన్లను విభజించుకోవాలి' అని అధికారులకు తెలిపారు.
'ఈ మూడు రీజియన్లలో ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి ఉండాలో డాక్యుమెంట్లో పొందుపరచాలి. హెల్త్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, జీసీసీలు, ఫార్మా, అగ్రికల్చర్‌తో పాటు వివిధ రంగాల్లో ఎక్కడెక్కడ ఏయే రంగం అభివృద్ధి ఉండాలో ప్రణాళిక రూపొందించాలి. మౌలిక వసతులు, రోడ్డు, పోర్ట్, కనెక్టివిటీ ముఖ్యమైనవి' అని అధికారులకు సీఎం చెప్పారు. సంక్షేమం, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, ఎనర్జీ డిపార్ట్ మెంట్.. ఇలా ప్రతీ రంగానికి సంబంధించి పాలసీ డాక్యుమెంట్లో స్పష్టత ఉండాలని ఆదేశించారు.
తెలంగాణ పాలసీ, భవిష్యత్ ప్రణాళికలు వివరించేలా పాలసీ డాక్యుమెంట్ ఉండాలని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండదని చాటి చెప్పేలా తెలంగాణ రైసింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలని చెప్పారు. కొత్తగా ఏర్పాటయ్యే ఎయిర్‌పోర్టులలో ప్రయాణికులతో పాటు కార్గో సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వాస్తవిక దృక్పథం కనిపించేలా డిజైన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook