Telangana high court big twist to cm revanth reddy govt: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ట్రాఫిక్ ఉల్లంఘనలపై సీరియస్ గా మాట్లాడారు. చాలా మంది ట్రాఫిక్ నియమాల్ని ఉల్లంఘించడంవల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అంతే కాకుండా వాహన దారులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించగానే వారి అకౌంట్ ల నుంచి ఆటో డెబిట్ అయ్యే విధంగా బ్యాంక్ లతో అనుసంధానం చేసుకొవాలన్నారు. కొత్త వాహనాలు కొనడానికి వచ్చినప్పుడు, ఆతర్వాత లైసెన్స్, ఆర్సీల కోసం అధికారుల వద్దకు వచ్చినప్పుడు వారి బ్యాంక్ ఖాతాలను తీసుకుని నేరుగా అనుసంధానం చేసుకొవాలన్నారు. ఎవరైన ట్రాఫిక్ ఉల్లంఘించగానే నేరుగా బ్యాంక్ లనుంచి డబ్బులు ఆటోడెబిట్ కట్ అయ్యే విధంగా విధానం తీసుకొని రావాలన్నారు . ఇది కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది.
దీనిపై అపోసిషన్ పార్టీలు, ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఇది హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని కూడా పలు పార్టీలు ఈ నిర్ణయంను వ్యతిరేకించాయి. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ క్రమంలో తాజాగా.. తెలంగాణ హైకోర్టు ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా హైకోర్టు పెండింగ్ చలాన్ల వసూళ్లపై బలవంతం చేయోద్దని పోలీసుల్ని ఆదేశించింది. అంతే కాకుండా పోలీసులు ఎక్కడంటే అక్కడ వాహనాల్ని ఆపడం, వసూలుకు బలవంతం పెట్టొద్దని చెప్పింది. పెండింగ్ చలాన్లు ఉంటే.. నోటీసులు ఇచ్చి న్యాయపరంగా వాటిని వసూలు చేసుకొవచ్చంది.
ఈ క్రమంలో తాళాలు లాక్కొవడం, రోడ్డు మీద డబ్బులు కట్టే వరకు కదలనివ్వకుండా ఉంచడం వంటి పనులు చేయోద్దని తెలిపింది. అయితే.. తెలంగాణ హైకోర్టు నిర్ణయంపై నెట్టింట భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల మూవీరేట్ల విషయంలో హైకోర్టును ఇరిటేట్ చేస్తున్నారని ఈ విధంగా హైకోర్టు ట్విస్ట్ ఇచ్చిందా .. ఏంటని కొంత మంది వింతగా మాట్లాడుకుంటున్నారు.
Read more: Renu Desai: నన్ను కాపాడటానికి ఎవరు లేరు.. ఎమోషనల్ అయిన రేణు దేశాయ్.. మ్యాటర్ ఏంటంటే..?
చలాన్ల భయంతోనే చాలా మంది రోడ్ల మీద చాలా వరకు జాగ్రత్తగా వాహనం నడ్పిస్తారని, ఇక పెండింగ్ చలాన్లు వసూలు చేయోద్దంటే ఆకతాయిలు ఇంకా పోలీసుల మాట వింటారా..?.. అంటూ మరికొంత మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణ హైకోర్టు నిర్ణయం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









