BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన రేవంత్ రెడ్డిపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఈ క్రమంలోనే జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు రేపు జరగనుండగా బీసీ సంఘాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీలతో సంబంధం లేకుండా పోటీ చేసిన బీసీ అభ్యర్థులకు ఓటు వేయాలని బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తీరుపై బీసీ సంఘాలు మండిపడ్డాయి.
Also Read: KTR: తెలంగాణ ప్రజలను నిండా మోసం చేసిన రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ: కేటీఆర్ తీవ్ర విమర్శలు
బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేసిందని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేయడంతోనే సాయి ఈశ్వర చారి ప్రాణత్యాగం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా రేవంత్ రెడ్డి దిగివచ్చి రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ జాక్‌పాట్! 5 శాతం డీఏ పెంపునకు ప్రభుత్వం నిర్ణయం
బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మ బలిదానం చేసుకున్న సాయి ఈశ్వర చారిని స్మరించుకుంటూ హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి ఈశ్వర చారి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖయలు చేశారు. 'తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తొలి అమరుడు శ్రీకాంతాచారి. బీసీ స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేయడంతో సాయి ఈశ్వర చారి ప్రాణత్యాగం చేశాడు. ఆత్మ బలిదానం చేసుకున్న సాయి ఈశ్వర చారి కుటుంబాన్ని రేవంత్ రెడ్డి ఆదుకోవాలి' అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
Also Read: Civils Exams: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకునే వారికి శుభవార్త!
'బీసీల రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి, కేంద్రం ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ఇచ్చిన జీఓలను అమలు చేయకుండా బీసీలను మోసం చేసిన రేవంత్ రెడ్డి తీరు దారుణం' అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకుండా బీసీ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోందని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
'అందాల పోటీలు, సమ్మిట్లు నిర్వహించి కోట్ల రూపాయలను దుబారాగా ఖర్చు చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా, ఉన్న రిజర్వేషన్లను 17శాతానికి తగ్గించి రేవంత్ రెడ్డి మోసం చేశాడు' అని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సంఘాలు, ప్రజా ఉద్యమాలు చేసిన ప్రభుత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ రిజర్వేషన్ల సాధన కొరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









