)
V Hanumantha rao falls down in bc reservation bandh protest: కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ లు తీసుకొస్తు జీవో కూడా జారీ చేసింది. ఈ క్రమంలో దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కాంగ్రెస్ కు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో అన్ని బీసీ సంఘాలు సీరియస్ అయ్యాయి. ఈ క్రమంలో అక్టోబర్ 18వ తేదీన తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి.
బీసీ ర్యాలీలో కిందపడిపోయిన కాంగ్రెస్ నాయకుడు వీ హనుమంత రావు
ర్యాలీ చేస్తుండగా బ్యానర్ అడ్డు తగలడంతో ముందుకి పడిపోయిన హనుమంతరావు pic.twitter.com/HXegpV90GH
— Telugu Scribe (@TeluguScribe) October 18, 2025
బీసీలకు రాజ్యాధికారమే టార్గెట్ గా ఈ బంద్ కు పిలుపునిచ్చాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా బంద్ కు సంఘీభావం తెలిపాయి. హైదరాబాద్ లో ఎక్కడికక్కడ రోడ్ల మీద వాహనాలు నిలిచిపోయాయి. ప్రజా రవాణా పూర్తిగా స్తంభించి పోయింది.ఈ నేపథ్యంలో బీసీ ర్యాలీలో అంబర్ పేటలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంత్ రావు పాల్గొన్నారు. ఫ్లెక్సీలు, ఫ్లకార్డులు పట్టుకుని నడుస్తుండగా ఆయన ఒక్కసారి కింద పడిపోయారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
అంబర్ పేటలో బీసీ సంఘాల బంద్ లో భాగంగా.. హనుమంత్ రావు ర్యాలీగా ఫ్లెక్సీపట్టుకుని వెళ్తున్నారు. ఇంతలో ఫ్లెక్సీ కాస్త హనుమంత రావు కాలి కిందకు రావడంతో ఆయన ఒక్కసారిగా కింద పడిపోయారు.
ఈ ఘటనతో కాంగ్రెస్ శ్రేణులంతా షాక్ కు గురయ్యారు. వెంటనే హనుమంత రావుకు సపర్యలు చేశారు. కాసేపు విశ్రాంతి తీసుకుని.. మరల హనుమంతన్న ర్యాలీలో యాక్టివ్ గా పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లు పాస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు కొన్ని రోజుల క్రితం హనుమంత్ రావు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ట్రీట్మెంట్ తీసుకుని ఇటీవల డిశ్చార్జీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన ఒక్కసారిగా కింద పడిపోవడంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.